Webdunia - Bharat's app for daily news and videos

Install App

Watermelon Day: పుచ్చకాయలను ఎందుకు తినాలి?

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (19:23 IST)
పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ తింటే దాహం తీరిపోతుంది. అందులో సందేహం లేదు. పుచ్చకాయల ద్వారా సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లు మీకు లభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులకి, ప్రేగు కేన్సర్‌కి, అలాగే మధుమేహానికి చాలా మంచివని పరిశోధనలు తెలియజేశాయి. వాటిలో ఎ, బి, మరియు సి- విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
 
తక్కువ కెలోరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ జూస్ తాగేందుకు అనువైన పానీయం. ఎందుకంటే, అందులో 92% నీరు ఉంటుంది, పైగా కొలెస్ట్రాల్ లాంటివి అందులో ఉండవు. అది వెంటనే తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే నీటిని కలిగి ఉండడం వల్ల. 
 
ఎంపిక : సరియైన పుచ్చకాయను ఎంచుకోవాలి. మచ్చలుగానీ, దెబ్బలుగానీ లేని నిగనిగలాడే పుచ్చకాయను ఎంచుకోవాలి. దాన్ని చుట్టూ తిప్పి చూసినప్పుడు ఒక ప్రక్క మీకు పసుపు రంగు కన్పిస్తుంది. అలా పసుపు రంగు కన్పించడం చాలా మంచి సూచన. ఆ రంగు అది సూర్య కిరణాలలో పండిందని తెలియజేస్తుంది. అది తీయగా, రసభరితంగా ఉంటుందనడానికి కూడా అదే సూచన. పుచ్చకాయను తట్టినపుడు బోలుగా ఉన్నట్టు శబ్దం వస్తే అది పండిందని అర్థం. 
 
పుచ్చకాయ పెద్దదిగా ఉంటుందని, రిఫ్రిజిరేటర్‌లో ఎక్కువ చోటుని ఆక్రమించేస్తుందని మీరు ఎప్పుడూ వెనుకాడుతుంటారా?. కానీ, ప్రస్తుతం లెక్కలేనన్ని చిన్న పుచ్చకాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి. కాబట్టి, ఈసారి పండ్ల షాపుకి వెళ్తే పుచ్చకాయ కొనడం మరచిపోకండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments