Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రౌన్ రైస్ పోషకాల గని.. వారానికి రెండు సార్లు తిన్నారంటే..?

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (16:00 IST)
పోష‌కాల ప‌రంగా చూస్తే వైట్ రైస్ క‌న్నా బ్రౌన్ రైస్‌లో అధిక పోషకాలున్నాయి. ముఖ్యంగా బ్రౌన్ రైస్‌లో ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, మిన‌రల్స్ అధికంగా ఉంటాయి. కానీ వైట్ రైస్‌లో ఈ పోష‌కాలు ఉండ‌వు. 
 
టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న కొంద‌రికి రోజూ బ్రౌన్ రైస్ ఇచ్చి చూడ‌గా వారిలో వైట్ రైస్ తినేవారితో పోలిస్తే షుగ‌ర్ లెవ‌ల్స్‌, హెచ్‌బీఎ1సి లెవ‌ల్స్ చాలా వ‌ర‌కు త‌గ్గిన‌ట్లు అధ్యయనంలో తేలింది. అందువ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారు బ్రౌన్ రైస్‌ను తిన‌డం మంచిది. రోజుకు 50 గ్రాముల బ్రౌన్‌రైస్ తీసుకుంటే మధుమేహం ముప్పు 16 శాతం తగ్గుతుంది.
 
ఇక బ్రౌన్ రైస్‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ త‌గ్గుతాయి. బ్రౌన్ రైస్‌లో ఫైబ‌ర్‌, ప్రోటీన్లు, మాంగ‌నీస్‌, విట‌మిన్లు బి1, బి3, బి5, బి6. కాప‌ర్‌, సెలీనియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్ అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ పోష‌ణ‌ను అందిస్తాయి. బ్రౌన్ రైస్‌లో రైబో ఫ్లేవిన్‌, ఐర‌న్‌, పొటాషియం, ఫోలేట్ ఉంటాయి.  ఊపిరిత్తుల వ్యాధి, అలాగే ఉబ్బసాన్ని సైతం బ్రౌన్‌రైస్ నియంత్రిస్తుంది. 
 
బ్రౌన్ రైస్ వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. బ్రౌన్ రైస్‌లోని మెగ్నీషియం, కాల్షియం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. వారానికి రెండు నుంచి మూడు రోజులు బ్రౌన్‌రైస్ తినేవారిలో ఆస్తమా ముప్పు 50 శాతం తగ్గుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments