Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీరకాయను నూనెలో వేయించి ఇలా చేస్తే..?

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (12:54 IST)
ప్రస్తుత సీజన్‌లో బీరకాయలు అధికంగా దొరుకుతున్నాయి. బీరకాయలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బీరకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇంకా చెప్పాలంటే.. బరువు తగ్గాలనుకునే వారి తరచు బీరకాయ తీసుకుంటే ఫలితం ఉంటుంది. బీరకాయలో క్యాలరీలు చాలా తక్కవుగా ఉన్నాయి కాబట్టి... ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
 
బీరకాయ రక్తాన్ని శుభ్రం చేస్తుంది. చర్మ సంరక్షణ ఎంతో దోహదపడుతుంది. మొటిమలు వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. దేహం నుండి ఆల్కహాల్ కారక వ్యర్థాలను తొలగించి కాలేయం, గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. కామెర్ల వ్యాధితో బాధపడేవారు.. ఈ వ్యాధిని తగ్గించాలంటే.. రోజుకు గ్లాస్ బీరకాయ రసాన్ని తీసుకుంటే.. మంచి ఫలితాలు పొందవచ్చును. దీంతో శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
 
బీరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. ఆపై నూనెలో వీటిని వేసి కొద్దిగా ఉప్పు, కారం కలిపి బాగా వేయించుకోవాలి. ఇందులో వేడి వేడి అన్నం కలిపి తింటే.. చాలా రుచిగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు తరచు ఇలాంటి పదార్థాలు తీసుకుంటే.. చాలు వ్యాధి నుండి విముక్తి లభిస్తుంది. 
 
బీరకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇధి మలబద్ధకం, పైల్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమంగా తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు బీరకాయ తీసుకుంటే చాలా మంచిది. బీరకాయలోని బీరా కెరోటిన్ ఈ వ్యాధిని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. కంటి సంబంధిత వ్యాధులకు బీరకాయ జ్యూస్ తాగితే చాలంటున్నారు వైద్యులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments