Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతిరోజూ పరుగు వ్యాయామం చేసేవారు ఇవి తినాలి

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (22:04 IST)
వ్యాయామాల్లో పరుగు కూడా ఒకటి. కొందరు నడక మాత్రమే చేస్తుంటారు. మరికొందరు పరుగు కూడా చేస్తుంటారు. జస్ట్ కొద్ది నిమిషాల పరుగుతో ఎన్నో రకాల రోగాల్ని దూరం చేసుకోవచ్చు. అయితే పరుగు వ్యాయామం చేసేవారు ఆహారంలో ఇవి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.
 
పరుగు తీసేవారు రోజూ ఒక కమలా తినాలి. కమలాలో ఉండే 'సి' విటమిన్‌ కండరాల అరుగుదలను నివారిస్తుంది. దీనిలో ఇనుము నిల్వల వల్ల అలసట, నీరసం దూరమవుతాయి. అలాగే బాదంపప్పు తీసుకోవాలి. వీటిలో వుండే యాంటీ ఆక్సిడెంట్‌ అయిన విటమిన్‌ 'ఇ' కీళ్ల నొప్పుల్ని దూరం చేస్తుంది. బాదంలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్లు పరుగు సమయంలో ఆకలి తెలియకుండా సాయపడతాయి. గుప్పెడు బాదం పప్పులను వారంలో నాలుగైదు రోజులు తీసుకుంటే చాలు.
 
పరుగు వ్యాయామం చేసేవారు వారంలో రెండ్రోజులు చేపల్ని ఆహారంలో తీసుకోవాలి. వీటిని తీసుకోవడం ద్వారా చేపలో వుండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. శాఖాహారులు పప్పులు, చిక్కుడు గింజలతో కూడిన ఆహారం తీసుకుంటే సరిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments