Webdunia - Bharat's app for daily news and videos

Install App

టేస్టీ పీతల వేపుడు, ఇంతకీ ఈ పీతల్లో ఏమున్నదో తెలుసా?

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (21:35 IST)
పీతల కూర అంటే చాలామంది లొట్టలు వేసుకుంటూ తింటారు. నాన్ వెజ్ ఇష్టపడేవారిలో పీతలను ఎంతో ఇష్టంగా తినేవారు వుంటారు. అసలు ఈ పీతలను తింటే చేకూరే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

 
పీతల్లో మన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు వుంటాయి. పీత ఆహారంలో చేర్చడానికి ఉత్తమమైన మత్స్య రకాల్లో ఒకటి, ఎందుకంటే ఇది శరీరాన్ని బలంగానూ, ఆరోగ్యంగా ఉంచడానికి దోహదం చేస్తుంది. 

 
అధిక ప్రోటీన్స్ కావాలంటే పీతలు తినాల్సిందే
కండరాలు, ఎముకలు, జుట్టు, చర్మం, రక్తం పట్టాలంటే శరీరానికి ప్రోటీన్ అవసరం. ఆహారంలో అధిక ప్రోటీన్ చేర్చుకోవడం వల్ల అనవసరమైన స్నాక్స్ జోలికి వెళ్లకుండా చేస్తుంది. అలాగే హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడే 
ఒమేగా-3 యాసిడ్‌లు పుష్కలంగా పీతల్లో వున్నాయి. ఇది గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఒమేగా-3 అనేది రక్తంలో కనిపించే కొవ్వును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

 
శరీరంలో ట్రైగ్లిజరైడ్‌ల సంఖ్యను నియంత్రించకపోతే, అవి స్ట్రోక్, గుండెపోటు లేదా గుండె జబ్బుల అవకాశాలను పెంచుతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు ప్రకారం ప్రతి ఒక్కరూ ఒమేగా-3 కలిగి ఉన్న చేపలను కనీసం వారానికి రెండుసార్లు తినాలని చెపుతోంది.

 
విటమిన్ బి2 నీటిలో కరిగేది కాబట్టి, దాని పూర్తి ప్రయోజనాలను పొందడానికి మన ఆహారం ద్వారా దీనిని తీసుకోవాలి. విటమిన్ బి2 ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడం ద్వారా పోషకాలను శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ విటమిన్ బి 2 తీసుకుంటే మంచిది. ఎందుకంటే మన శరీరం దానిని తక్కువ మొత్తంలో మాత్రమే నిల్వ చేయగలదు. కనుక పీతలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments