Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చందన చూర్ణం ఉపయోగాలు

సిహెచ్
బుధవారం, 17 ఏప్రియల్ 2024 (00:00 IST)
తెల్లగంధం చెట్టు చలువ స్వభావంతో మనసుకి ఆహ్లాదాన్నిస్తుంది. కఫం, అలసట, విషాలు, దాహం, రక్తపైత్య రోగాలను అణిచివేస్తుంది. హరిచందనం ముఖంపై మంగుమచ్చలను తగ్గిస్తుంది. రక్త చందనం చలువ స్వభావాన్ని కలిగి వుంటుంది. ఈ గంధాలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
తుమ్ములు విపరీతంగా వస్తుంటే మేలురకమైన మంచిగంధం చెక్కను మాటిమాటికి వాసన చూస్తుంటే సమస్య పోతుంది.
మంచిగంధం పొడి, హారతి కర్పూరం సమంగా కలిపి మంచినీటితో మెత్తగా నూరి బొడ్డుపై లేపనం చేస్తే కడుపునొప్పి, నీళ్లవిరేచనాలు తగ్గుతాయి.
ఎర్రచందనం, మంజిష్ట, లొద్దుగచెక్క, చంగల్వకోస్టు, మర్రిచిగుర్లు, నల్లపెసలు సమంగా తీసుకుని నీటితో మెత్తగానూరి బొల్లి మచ్చలపై రాస్తే సమస్య తగ్గుతుంది.
మూత్రం సాఫీగా కాకుండా బొట్టుబొట్టుగా పడుతుంటే 3 గ్రా. చందనచూర్ణం, 3 గ్రా. చక్కెర కలిపి కప్పు బియ్యం కడిగిన నీటితో సేవిస్తే మేలు కలుగుతుంది.
పాలతో గంధాన్ని అరగదీసి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
స్నానం చేసే నీళ్లలో గంధం నూనె అయిదారు చుక్కలు వేసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావు.
రోజ్ వాటర్‌లో గంధం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మీద రాష్‌ వుంటే పోతుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments