వేసవిలో ఎండల కారణంగా మన శరీరం అధిక వేడిని కలిగి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి బార్లీ నీరు ఒక ఔషదంలా పని చేస్తుంది. బార్లీలో అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
బార్లీలో ఉండే బీటా-గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుండి విషపదార్ధాలను బయటకు నెట్టివేస్తాయి.
మసాలా పుడ్ తీసుకోవటం వలన కలిగే కడుపుమంటను ఈ పానీయం తగ్గిస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధ పడేవారు బార్లీనీటిని తాగటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది.
షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఈ పానీయాన్ని ప్రతిరోజు తాగటం వలన వారి శరీరంలోని చక్కెరస్ధాయిలు కంట్రోల్‌లో ఉంటుంది.
బార్లీ వాటర్‌లో ఉండే అధిక ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
బార్లీ రక్తపోటును తగ్గిస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలు రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ఈ పానీయాన్ని సేవించటం ఉపయోగకరం.
మూత్రపిండాలలో ఉన్న రాళ్లను బయటకు పంపించటంలో ఈ బార్లీ నీళ్లు ఎంతగానో సహాయపడతాయి.
అధికబరువును తగ్గించుకోవటంలో ఈ బార్లీ ఎంతగానో సహాయపడుతుంది.