Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బియ్యం కడిగిన నీళ్లలో చందన చూర్ణం, చక్కెర కలిపి తీసుకుంటే?

Advertiesment
Red sandal
, శనివారం, 27 మే 2023 (22:37 IST)
తెల్లగంధం చెట్టు చలువ స్వభావంతో మనసుకి ఆహ్లాదాన్నిస్తుంది. కఫం, అలసట, విషాలు, దాహం, రక్తపైత్య రోగాలను అణిచివేస్తుంది. హరిచందనం ముఖంపై మంగుమచ్చలను తగ్గిస్తుంది. రక్త చందనం చలువ స్వభావాన్ని కలిగి వుంటుంది. ఈ గంధాలతో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తుమ్ములు విపరీతంగా వస్తుంటే మేలురకమైన మంచిగంధం చెక్కను మాటిమాటికి వాసన చూస్తుంటే సమస్య పోతుంది.
 
మంచిగంధం పొడి, హారతి కర్పూరం సమంగా కలిపి మంచినీటితో మెత్తగా నూరి బొడ్డుపై పలుచగా లేపనం చేస్తే కడుపునొప్పి, నీళ్లవిరేచనాలు తగ్గుతాయి. ఎర్రచందనం, మంజిష్ట, లొద్దుగచెక్క, చంగల్వకోస్టు, మర్రిచిగుర్లు, నల్లపెసలు సమంగా తీసుకుని మంచినీటితో మెత్తగానూరి బొల్లి మచ్చలపై రాస్తే సమస్య తగ్గుతుంది.
 
మూత్రం సాఫీగా కాకుండా బొట్టుబొట్టుగా పడుతుంటే 3 గ్రాముల చందనచూర్ణం, 3 గ్రాముల చక్కెర కలిపి కప్పు బియ్యం కడిగిన నీటితో సేవిస్తే మేలు కలుగుతుంది. పాలతో గంధాన్ని అరగదీసి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. స్నానం చేసే నీళ్లలో గంధం నూనె అయిదారు చుక్కలు వేసుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు రావు. రోజ్ వాటర్‌లో గంధం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మీద రాష్‌ వుంటే పోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు సింపుల్ టిప్స్