Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాప్ నీటి కంటే.. ప్యాక్డ్ వాటర్ టేస్టుగా వుందా? (video)

ఇంటి ట్యాప్‌లో వచ్చే నీటికంటే.. ప్యాక్డ్ వాటర్ టేస్టుగా వుందంటూ తెగ తాగేస్తున్నారా? ఇక ఆపండి. లేకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాక్డ్ వాటర్‌లో టేస్టు కోసం రసాయనాలు

Webdunia
మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:27 IST)
ఇంటి ట్యాప్‌లో వచ్చే నీటికంటే.. ప్యాక్డ్ వాటర్ టేస్టుగా వుందంటూ తెగ తాగేస్తున్నారా? ఇక ఆపండి. లేకుంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్యాక్డ్ వాటర్‌లో టేస్టు కోసం రసాయనాలు కలుపుతున్నారని... ఇవి తీసుకుంటే రోగాలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.


ప్లాస్టిక్ బాటిళ్లలో అమ్మే నీటిని, క్యాన్లలో భద్రపరిచి అమ్మే నీటిని తీసుకునే వారిలో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయని.. పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి తగ్గిపోతుందని అధ్యయనం తేల్చింది. 
 
విటమిన్ ఎన్‌రిచ్డ్ వాటర్ బాటిల్స్‌లో వుండే నీటిని తాగినా ఇదే పరిస్థితి తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్లలో భద్రపరిచే నీటిని సేవించడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందని.. ప్లాస్టిక్ బాటిల్స్‌లో వుండే కెమికల్స్ వ్యాధి నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. అంతేగాకుండా.. మినరల్ వాటర్‌ను సేవిస్తే.. కిడ్నీలకు దెబ్బేనట. మినరల్ వాటర్‌లోని రసాయనాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు కారకమవుతాయని వైద్యులు చెప్తున్నారు. 
 
ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్‌లో నిల్వ చేసే నీటిలో సూక్ష్మాతి సూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ఇలాంటి ప్లాస్టిక్ రేణువులున్న నీటిని తాగితే శరీర వాపు, విరేచనాలు, థైరాయిడ్ సమస్యలు లాంటివి తలెత్తుతాయట. ఇలాంటి నీరు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాదకరం. ఈ నీటిని గర్భిణులు తాగితే వారికి తక్కువ బరువున్న శిశువులు పుడుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments