Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కోలుకున్నాక ప్రాణాయామం చేయొచ్చా?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (11:43 IST)
సాధారణంగా కరోనా వైరస్ బారిన కోలుకున్న వారికి ఊపిరితిత్తులు ఎంతోకొంత బలహీనపడతాయి. కాబట్టి వాటికి ఏ స్వల్ప ఇబ్బంది కలిగినా వాటి సామర్ధ్యం మరింత తగ్గిపోతుంది. వీరికి ఎసిడిటీ ఉంటే, పడుకున్న సమయంలో గొంతులోకి తన్నుకొచ్చే యాసిడ్లు స్వల్ప పరిమాణాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదం ఉంటుంది. ఇలా చేరుకున్న యాసిడ్‌ వల్ల ఊపిరితిత్తులు క్రమేపీ మరింత బలహీనపడతాయి. కాబట్టి ఎసిడిటీ ఉన్నవాళ్లు వైద్యుల సూచన మేరకు దాన్ని తగ్గించే మందులు వాడవలసి ఉంటుంది. 
 
ముఖ్యంగా, కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఊపిరితిత్తులను బలపరిచే ప్రాణాయామం చేయడం సరికాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. కరోనా ఇన్‌ఫెక్షన్‌తో బలహీనపడిన ఊపిరితిత్తులు ప్రాణాయామంలో తీసుకునే వేగవంతమైన శ్వాస ప్రక్రియలతో మరింత అసౌకర్యానికి లోనవుతాయి. 
 
బలంగా, వేగంగా శ్వాస తీసుకుని వదిలే వ్యాయామాలతో ఊపిరితిత్తుల మీద పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రారంభంలో అలోమ, విలోమ వ్యాయామాలు చేయడం మేలు. ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకుని, ప్రాణాయామానికి అనువుగా మారినట్టు వైద్యులు ధ్రువీకరించిన తర్వాతే భస్త్రిక వంటి ప్రాణాయామ ప్రక్రియలను సాధన చేయాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్.. ప్రేమ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారం

కానిస్టేబుల్ చెంప ఛెళ్లుమనిపించిన టీడీపీ మంత్రి సోదరుడు (వీడియో)

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

తర్వాతి కథనం
Show comments