Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసులో అలసిపోతున్నారా? బొప్పాయి ముక్కలు తినండి

ఆఫీసులో అలసిపోతున్నారా? ఒత్తిడి వేధిస్తుందా..? అయితే ఒక కప్పులో బొప్పాయి పండ్లను ఇంటి నుంచి తెచ్చుకుని తినాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇంటికెళ్లిన వెంటనే కాఫీలు, టీ తీసుకోకుండా ఒక కప్

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (12:03 IST)
ఆఫీసులో అలసిపోతున్నారా? ఒత్తిడి వేధిస్తుందా..? అయితే ఒక కప్పులో బొప్పాయి పండ్లను ఇంటి నుంచి తెచ్చుకుని తినాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. లేదంటే ఇంటికెళ్లిన వెంటనే కాఫీలు, టీ తీసుకోకుండా ఒక కప్పు బొప్పాయి ముక్కలను తీసుకోవడం చేయాలి. బొప్పాయిలో వుండే విటమిన్ సి.. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. అంతేగాకుండా విటమిన్ సి.. ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బొప్పాయి మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తుంది. 
 
మధుమేహం రాకుండా వుండాలంటే రోజూ ఒక కప్పు బొప్పాయి పండ్లను తీసుకోవాలి. అలాగే బొప్పాయి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. బొప్పాయి పండు వయసు మీరిన కొలది కలిగే సమస్యలను దూరం చేస్తుంది. యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని విటమిన్ సి, విటమిన్ ఇ, యాంటీయాక్సిడెంట్లు, బీటా-కెరోటినాయిడ్ వంటివి ఫ్రీ-రాడికల్ వల్ల చర్మంపై ఏర్పడే ప్రమాదాన్ని దూరం చేస్తాయి. 
 
రోజులో రెండు సార్లు బొప్పాయి పండు తినటం వలన అనారోగ్యాలు దూరం అవుతాయి. బొప్పాయి పండు ఫైబర్‌ను అధికంగా కలిగి ఉండటం ద్వారా గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

కాంట్రాక్ట్‌పై సంతకం చేయగానే.. నో డేటింగ్ అనే షరతు పెట్టారు : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments