Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిగుళ్ల ఆరోగ్యానికి మేలు చేసే జీడిపప్పు..

బాదం, జీడిపప్పులను తీసుకోవడం ద్వారా అందులో మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. పిస్తాలోని బీ6 విటమిన్ గుండె సమస్యలను నివారిస్తుంది. ఖర్జూరాలు రక్తనాళాలను గట్టిపడనీయకుండా చేస్త

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (10:11 IST)
బాదం, జీడిపప్పులను తీసుకోవడం ద్వారా అందులో మంచి కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి. పిస్తాలోని బీ6 విటమిన్ గుండె సమస్యలను నివారిస్తుంది. ఖర్జూరాలు రక్తనాళాలను గట్టిపడనీయకుండా చేస్తాయి. ఎండుద్రాక్ష, ఖుబానీ వంటి వాటిల్లో ఐరన్‌ దండిగా ఉంటుంది. అందువల్ల ఇవి రక్తహీనత బారినపడకుండా కాపాడతాయి.
 
జీడిపప్పులో కొలెస్ట్రాల్‌ అసలే ఉండదు. పిస్తాలోని మంచి కొవ్వులు కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలోని ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం, మెగ్నీషియం రక్తప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడతాయి. ఎండుద్రాక్షలో విటమిన్‌ ఎ, క్యాల్షియం పుష్కలంగా వుంటాయి. ఇవి ఎముక పుష్టికి, చూపు బాగుండటానికి దోహదం చేస్తాయి. 
 
జీడిపప్పులోని మెగ్నీషియం, క్యాల్షియం కండరాలు, చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బాదంపప్పులో క్యాల్షియంతో పాటు విటమిన్‌ ఇ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ఇది ఎముకల పటుత్వానికే కాదు.. చర్మం ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. వీటిని పొట్టు తీయకుండా తింటేనే మంచిది. ఎందుకంటే గుండెను కాపాడే ఫ్లావనాయిడ్లు ఈ పొట్టులోనే ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఢిల్లీలో కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోండి.. ప్లీజ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

అబ్బాయి కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు (video)

బిస్కెట్ ప్యాకెట్లో పురుగులు.. పిల్లలూ జాగ్రత్త.. ఇంటి ఫుడ్డే సేఫ్

కార్తీకమాసం గుడి ప్రదక్షణలు చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD జనవరి 3, 2025న జపాన్‌లో రిలీజ్

విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ సాహిబా ప్రోమో రిలీజ్

రాయలసీమ ప్రేమకథలో అఖిల్ అక్కినేని.. డైరక్టర్ ఎవరంటే?

డాక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ దర్శకుడు.. ఎవరు?

డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి.. నెట్టింట ఫోటోలు వైరల్

తర్వాతి కథనం
Show comments