Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీర్యకణాల వృద్ధికి లవంగాలు..

తేనె, కొన్ని చుక్కల లవంగం నూనెను గోరువెచ్చటి నీటిలో కలిపి రోజులో మూడుసార్లు తాగితే జలుబు తగ్గిపోతుంది. లవంగాలను పొడి చేసి, నీళ్ళలో తడిపి ఈ ముద్దను వాసనచూస్తుంటే సైనస్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆహారంలో

Webdunia
గురువారం, 12 అక్టోబరు 2017 (10:02 IST)
తేనె, కొన్ని చుక్కల లవంగం నూనెను గోరువెచ్చటి నీటిలో కలిపి రోజులో మూడుసార్లు తాగితే జలుబు తగ్గిపోతుంది. లవంగాలను పొడి చేసి, నీళ్ళలో తడిపి ఈ ముద్దను వాసనచూస్తుంటే సైనస్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆహారంలో లవంగాన్ని ఉపయోగించడం ద్వారా ఒత్తిడి, అలసట, ఆయాసం తగ్గుతాయి. శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంలో లవంగం చక్కగా పనిచేస్తుంది. 
 
లవంగాలలో ఉండే యూజెనాల్‌ అనే రసాయన పదార్థం నోటిలోని బ్యాక్టీరియాను కూడా నివారిస్తుంది. లవంగాలు వీర్య కణాల వృద్ధికి కూడా తోడ్పాటునందిస్తాయి. తులసి, పుదీనా, లవంగాలు, యాలకల మిశ్రమంతో టీ చేసుకుని తాగితే నరాలకు శక్తి లభించి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఈ టీలో చక్కెరకు బదులు తేనెను ఉపయోగించడం ఉత్తమమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
ఆస్తమా, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులను నివారించడంలో కూడా యాలకులు, లవంగాలు బాగా పనిచేస్తాయి. రెండుమూడు యాలకులు, లవంగాలు, ఓ అల్లం ముక్కను కాసిన్న దనియాలతో కలిపి పోడి చేసి పెట్టుకోవాలి. రోజూ గ్లాస్ వేడినీటిలో వేసుకుని తాగితే అజీర్ణ సమస్య దూరమవుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్య నుంచి ఉపశమనం పొందుతారని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

విశాఖలో జూన్ 9న వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం - బొత్స జోస్యం

ప్రియుడి మోజులోపడి భర్త హత్య... మనశ్సాంతి లేక నిందితుడు లొంగుబాటు!!

హైదరాబాదులో అక్రమ డ్రగ్స్... గంజాయి స్వాధీనం, నలుగురు అరెస్ట్

వైకాపాకు మహా అయితే 25 సీట్లు వస్తే ఎక్కువ : ఆర్ఆర్ఆర్ జోస్యం

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

తర్వాతి కథనం
Show comments