Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెజబ్బుతో బాధపడేవారు.. రోజూ జామపండును తీసుకుంటే?

గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్య

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (11:35 IST)
గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతిరోజూ భోజనంతో పాటు జామపండును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంది. ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు సేవిస్తే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుంది. 
 
ప్రతిరోజూ ఒక జామకాయ తింటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చును. పచ్చి జామకాయ తింటే చిగుళ్లు, దంతాలు గట్టిపడతాయి. ఇందులో విటమిన్-సి అధిక మొత్తంలో ఉండడంతో చిగుళ్ల నుంచి రక్తస్రావం ఆగుతుంది. పచ్చి జామకాయ ముక్కలను కప్పెడు తీసుకొని, బాగా ఎండబెట్టి, దానికి అర చెంచా మిరియాలు, అర చెంచా సైందవ లవణాన్ని వేసి మెత్తగా పొడిచేసి సీసాలో నిల్వ చేసుకోవాలి. దానిని ప్రతిరోజూ పళ్లపొడిలా వాడితే దంతాలు గట్టి పడడమే కాకుండా చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.
 
బాగా పండిన జామ పండ్ల గుజ్జులోంచి గింజలు తొలగించి పాలు తేనె కలిపి తీసుకుంటే విటమిన్-సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలకు, గర్భిణులకు దీనిని టానిక్‌లా వాడవచ్చు. జామపండులో సి-విటమిన్ అధికంగా ఉండడంతో చర్మానికి మేలు చేస్తుంది. వీటితో పాటు జుట్టు రాలటాన్ని నివారిస్తుంది. విటమిన్-ఏ అధికంగా ఉండే జామపండుతో కంటి సంబంధిత సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments