Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొన్నరొట్టె, రాగి జావ, సజ్జల కిచిడీ తీసుకుంటే ఏం జరుగుతుంది?

Webdunia
సోమవారం, 15 ఏప్రియల్ 2019 (15:21 IST)
సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు... ఇవన్నీ చిరు మరియు తృణధాన్యాలే. వీటన్నింటినీ కలిపి ఇంగ్లిష్‌లో మిల్లెట్స్‌ అంటారు. పోషకాలను బట్టి ముతకధాన్యాల్లోని రకాలైన జొన్నల్ని కూడా ఈ జాబితాలోకి చేరుస్తుంటారు. దాంతో గత కొన్నేళ్లుగా మన ఆహారంలో ప్రధానపాత్ర పోషిస్తున్న బియ్యం మీద అనేక పరిశోధనలు చేస్తున్నారు నిపుణులు. 
 
బాగా పాలిష్‌ చేసిన బియ్యం తినడంవల్ల బరువు పెరగడం, మధుమేహం బారిన పడటం పెరిగింది. ఆధునిక జీవనశైలి కూడా మరో కారణం. ఈ పరిస్థితుల్లో మిల్లెట్స్‌ని రోజూవారీ ఆహారంలో భాగంగా చేర్చాల్సిన అవసరం ఉందనీ, ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివనీ వాళ్లు నొక్కి చెబుతున్నారు. 
 
పీచు ఎక్కువగా ఉండటంతో వీటి పిండితో రుచికరమైన వంటలు చేయలేం. చూడ్డానికీ అంత బాగుండవు. అందుకే చిరుధాన్యాల వాడకం బాగా తగ్గింది. ఇప్పుడు పొట్టు తీసి, పీచును తగ్గించి మృదువైన పిండిని తయారుచేసే యంత్రాలు చాలానే వచ్చాయి. వీటిద్వారా పిండి, రవ్వ పట్టిస్తే అన్ని రకాలూ చేసుకోవచ్చు.
 
నలభై దాటకుండానే అధిక రక్తపోటూ, మధుమేహం లాంటి సమస్యలు ఈ రోజుల్లో చాలామంది మహిళల్ని వేధిస్తున్నాయి. వాటి ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే చిరుధాన్యాల్ని మించిన పరిష్కారం లేదంటున్నాయి అధ్యయనాలు. వీటిల్లో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు విశ్రాంతి పొందేలా చేసి, రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు దోహదం చేస్తుంది. దాంతో అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆ పోషకాన్ని సమృద్ధిగా అందుకోవాలంటే బార్లీ, సజ్జలూ, రాజ్‌గీరా, సామల్లాంటివి తీసుకోవాలి
 
చిరుధాన్యాల్లో పీచుశాతం, నిదానంగా జీర్ణమయ్యే పిండిపదార్థాలు ఎక్కువగా, కొవ్వుశాతం తక్కువగా ఉంటాయి. అందుకే కొద్దిగా తీసుకున్నా పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. తరవాత కొన్ని గంటలపాటు ఆకలి వేయదు. ముఖ్యంగా జొన్నల్నే తీసుకుంటే వీటి నుంచి మాంసకృత్తులు సమృద్ధిగా అందుతాయి. 
 
ఇనుమూ, క్యాల్షియం, జింక్‌, పొటాషియం, పాస్ఫరస్‌ లాంటి పోషకాలూ లభిస్తాయి. అదనంగా థయామిన్‌, రైబోఫ్లేవిన్‌ లాంటి బి విటమిన్లూ... టానిన్లూ, ఫెనోలిక్‌ ఆమ్లాలూ, యాంథోసియానిన్స్‌ లాంటి ఫైటోకెమికల్స్‌ అందుతాయి. ఇవన్నీ బరువు తగ్గించడానికి ఉపయోగపడేవే. శరీరానికి శక్తినిచ్చేవే. గర్భిణులు తాము తీసుకునే ఆహారంలో జొన్నల్ని చేరిస్తే వాళ్లకు అవసరమైన విటమిన్లూ, ఖనిజాలూ అందుతాయని అధ్యయనాల్లో తేలింది.
 
చిరుధాన్యాల్ని ఒకేసారి కాకుండా నెమ్మదిగా జీవనవిధానంలో చేర్చుకోవాలి. రోజువారీ తీసుకునే ఆహారంలో యాభై, అరవైశాతం వరకూ చిరుధాన్యాలతో చేసిన పదార్థాలుండేలా చూసుకోవాలి. కొందరికి వాటి రుచి నచ్చదు. కొన్నిసార్లు అరగదు. అలాంటప్పుడు చేసుకునే విధానాన్ని ఓసారి గమనించుకోవాలి. సాధారణ పద్ధతిలోనే వాటిని చేసుకోవాలి. అంటే జొన్నరొట్టె, రాగి జావ, సజ్జల కిచిడీ రూపంలో తీసుకోవాలి. మెనోపాజ్‌ దాటి అధిక కొలెస్ట్రాల్‌, అధికరక్తపోటు లేదా గుండెజబ్బులొచ్చే ఆస్కారం ఉన్న మహిళలు వారంలో కనీసం ఆరుసార్లు చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ అదుపులో ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

వై.ఎస్. గురించి మీకు ముందే తెలుసా ! అని అడిగారు : దర్శకుడు శశికిరణ్‌ తిక్క

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

తర్వాతి కథనం
Show comments