Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాచిన వేడి నీళ్లు తాగుతున్నారా? అందులో చల్లని నీళ్లు పోస్తే..?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (13:51 IST)
వేడిగా వున్న నీటితో తాగేందుకు అనువుగా చల్లని నీరు కలిపితే ప్రయోజనం వుండదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాచిన నీళ్లు మరీ వేడిగా ఉన్నాయని, అందులో చల్లని నీళ్లు పోస్తే ఎలాంటి ఫలితం కనిపించదు. వేడి వేడి నీటిని కప్పులోకి తీసుకుని కాసేపు ఆరబెట్టి తాగడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. కానీ ఆ వేడి నీటిలో చల్లని నీటిని లేదా.. వేడి చేయని నీటిని చేర్చి తీసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం వుండదు. 
 
ఈ నీటిని సేవించడం ద్వారా శరీరంలోని మలినాలు తొలగిపోవని.. అందుకే వేడి నీటిని కాసేపు ఆరిన తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజూ వేడి నీళ్లు తాగడం ద్వారానే వ్యాధులను దూరం చేసుకోవచ్చు. కడుపు ఉబ్బరం, ఎక్కిళ్లు, జలుబు, దగ్గు, ఆయాసం తగ్గడానికి వేడినీరు ఎంతగానో తోడ్పడతాయి. తలనొప్పి, పార్శ్వపు తలనొప్పి ఇతర ఉదర రోగాలు తగ్గడానికి దోహదం చేస్తాయి. 
 
రాత్రి నిద్రపోయే వేళ వేడినీళ్లు తాగితే, వాతం, దగ్గు తగ్గుతాయి. తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. మధుమేహ రోగులు రోజూ వేడినీళ్లు సేవించడం ఎంతో మేలు. దానివల్ల తిన్న ఆహార పదార్థాలు చక్కగా జీర్ణం కావడంతో పాటు, క్లోమగ్రంధి పని తీరు మెరుగుపడుతుంది. మధుమేహం నియంత్రణలో వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments