Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొర్రబియ్యంతో అన్నం మంచిదా కాదా? (video)

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (23:07 IST)
ఇపుడంతా బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయనీ, అందువల్ల గుండె జబ్బులు, మధుమేహం సమస్యలు వస్తున్నాయని చాలామంది చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. వాటిలో కొర్రబియ్యం ఇపుడు చేరిపోయింది. అంతా వాటి పట్ల ఇష్టతను ప్రదర్శిస్తున్నారు. ఈ కొర్రలు ఆరోగ్యానికి మంచిదా కాదా చూద్దాం.
 
గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను కలిగించే గ్లుటెన్ కొర్రబియ్యంలో ఉండదు. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచటంలో సహాయపడుతుంది.
 
కీళ్లనొప్పులను, జ్వరాన్ని తగ్గిస్తుంది. కాలిన గాయాలు త్వరగా మానటానికి ఉపయోగపడుతుంది. స్త్రీలలో రక్తస్రావాన్ని అదుపులో ఉంచుతుంది.
 
కొర్రలలో మాంసకృత్తులు, ఐరన్ శాతం ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
 
వీటిలో పీచుపదార్ధం ఎక్కువుగా ఉండటం వలన ఇది మలబద్దక సమస్యను తగ్గిస్తుంది.
 
దీనిలో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్ అధికపాళ్లలో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు కొర్రబియ్యం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది.
 
ఉదర సంబంధ సమస్యలకు కొర్రబియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, అజీర్తి సమస్యలకు ఇది చక్కగా పని చేస్తుంది. జీర్ణ నాళాన్ని శుభ్రం చేయడంలో ఇది ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది మూత్రం పోసేటప్పుడు మంటను తగ్గిస్తుంది.
 
 
కొర్రబియ్యం వండుకునే విధానం.....
ఒక గ్లాసు కొర్రలను శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీరు పోసి ఒక గంట నానబెట్టాలి. నానబెట్టిన కొర్రబియ్యాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఒకవేళ ఇలా తినలేకపోతే సగం బియ్యం, సగం కొర్రలు కలిపి వండుకోవచ్చు. ఈ అన్నంలో వేపుడు కూరలకన్నా పులుసు కూరలు ఎక్కువ రుచిని ఇస్తాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments