Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతో వ్యాధి నిరోధక శక్తి

Webdunia
బుధవారం, 28 జులై 2021 (03:18 IST)
పెరుగులో ఉండే పోషకాల కారణంగా మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్‌ వేసుకున్నంతటి  ఫలితం ఉంటుందనీ, పైగా ఇది స్వాభావికంగా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.
 
అంతేకాదు... పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్‌ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందట. మిగతావారితో పోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్‌ సైంటిఫిక్‌ సెషన్స్‌లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు.
 
ఇక మహిళలకు పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు ఇన్నీ అని చెప్పలేం. పెరుగులోని ల్యాక్టోబాసిల్లస్‌ అసిడోఫిల్లస్‌ బ్యాక్టీరియా అనే మంచి బ్యాక్టీరియా వల్ల మహిళల్లో అనేక ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ముఖ్యంగా మహిళల యోనిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
 
పెరుగులోని మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చూడటం మాత్రమే కాదు... కడుపులో మంటనూ తగ్గిస్తుంది. అందువల్ల తాజా పెరుగుతో చిలికిన మజ్జిగ తాగగానే కడుపు మంట తగ్గడం మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments