ఉలిక్కిపడిన భారతం... 'నిపా' వైరస్ గాలిలో వ్యాపిస్తుందా?

భారతావని ఒక్కసారి ఉలిక్కిపడింది. అంతుచిక్కని వైరస్‌ సోకి ఏకంగా 10 మంది చనిపోయారు. ఇది యావత్ భారతవనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేనా, ఈ వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన ఓ నర్సు కూడా ప

Webdunia
బుధవారం, 23 మే 2018 (09:40 IST)
భారతావని ఒక్కసారి ఉలిక్కిపడింది. అంతుచిక్కని వైరస్‌ సోకి ఏకంగా 10 మంది చనిపోయారు. ఇది యావత్ భారతవనిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేనా, ఈ వైరస్ బారిన పడిన రోగులకు చికిత్స చేస్తూ వచ్చిన ఓ నర్సు కూడా ప్రాణాలు కోల్పోయింది. ఇది మరింత విషాదానికి గురిచేసింది. ఆ వైరస్ పేరు నిపా. అసలు ఇలాంటి అంతుచిక్కని వైరస్ ఎలా వ్యాపించింది? ఎక్కడ నుంచి వచ్చింది? ఈ వైరస్‌ను నియంత్రించగలమా అనేది పరిశీలిస్తే...
 
నిజానికి నిపా వైరస్‌ కొత్తదేం కాదు. అరుదైనది, తీవ్రమైనది, ప్రాణాంతకమైనది. ఈ వైరస్‌తోనే ముగ్గురు కేరళ వాసులు చనిపోయారని పూణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ధృవీకరించింది. ఆ తర్వాత కొన్నేళ్లుగా వినిపించకుండా పోయింది. ఇపుడు మళ్లీ తెరపైకి వచ్చింది. 
 
ఈ వైరస్‌ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్తగా వెలుగులోకొచ్చిన 'జూనోసిస్' (జంతువు నుంచి మనుషులకు వ్యాపించే వైరస్‌)గా ఇంతకుముందే గుర్తించింది. 'ఫ్రూట్‌ బ్యాట్స్' అనే ఒక రకం గబ్బిళాలు నిపా వైరస్‌కు వాహకాలుగా పని చేస్తాయని కూడా గుర్తించారు. 
 
ఈ వైరస్‌ 1998లోనే మలేసియా, సింగపూర్‌లో బయటపడింది. అప్పట్లో ఈ వైరస్‌ పందుల్లో కనిపించి, వాటి ద్వారా మనుషులకు వ్యాపించింది. గబ్బిళాలు, పందులు, మనుషులు... వీళ్లలో ఎవరి నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ సోకవచ్చు. ఈ వైరస్‌ సోకిన గబ్బిళాలు ఎంగిలి చేసిన తాటి గుజ్జు తినడం మూలంగా మనుషులకు సోకింది. 
 
ఈ వైరస్‌ గాలి ద్వారా సోకదు. అప్పటికే వైరస్‌ సోకిన జంతువు లేదా మనిషితో డైరెక్ట్‌ కాంటాక్ట్‌ వల్ల మాత్రమే వ్యాపిస్తుంది. ఈ వైరస్‌ సోకిన వెంటనే తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు, జ్వరం, మత్తు, మతిస్థిమితం తప్పినట్టు అనిపించే కన్‌ఫ్యూజన్‌ మొదలైన లక్షణాలుంటాయి. ఆ తర్వాత ఇన్‌ఫెక్షన్‌ ముదిరి కోమాలోకి వెళ్లిపోతారు. ఆ దశలో బ్రతికించడం కష్టం.
 
ఈ వైరస్‌ను నియంత్రించే టీకాలు ఇంకా తయారు కాలేదు. అయితే ఈ వైరస్‌ను సమర్థంగా చంపగలిగేది ఇంటెన్సివ్‌ సపోర్టివ్‌ కేర్‌ చికిత్స ఒక్కటే! ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే వైరస్‌ ఉన్న ప్రాంతాల్లో పందులు, గబ్బిళాలు లేకుండా చూసుకోవాలి. చికిత్స చేసే వైద్యులు మాస్క్‌లు, గ్లోవ్స్‌ వేసుకోవాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ ట్వీట్‌కు రైల్వేశాఖ స్ట్రాంగ్ కౌంటర్

చమురు దిగుమతులపై మరోమారు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్.. లెక్క చేయని భారత్...

హాంకాంగ్ ఎయిర్‌పోర్టులో ప్రమాదం - ఇద్దరు మృతి

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష ముప్పు

కన్నుల పండుగగా అయోధ్య దీపోత్సవం- గిన్నిస్ బుక్‌లో చోటు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

తర్వాతి కథనం
Show comments