రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి.. వైద్యులు ఏం చెబుతున్నారు?

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (12:26 IST)
సాధారణంగా చాలా మంది పొద్దస్తమానం నిద్రపోతుంటారు. మరికొందరు వేళాపాళా లేకుండా నిద్రిస్తుంటారు. ఇంకొందరు సమయం దొరికితో చాలు.. పడక ఎక్కుతుంటారు. అసలు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి. మనిషి శరీరానికి ఎన్ని గంటల నిద్రసరిపోతుంది. ఎన్ని గంటలు నిద్రపోతే మనిషి శరీరానికి అలసట అనేది లేకుండా ఉంటుంది అనే అంశాలపై వైద్యులను సంప్రదిస్తే, 
 
వైద్యుల అభిప్రాయం మేరకు.. రోజులో మనిషికి ఏడు గంటల ప్రశాంతమైన నిద్ర కావాలని చెబుతున్నారు. నిద్ర అంతకన్నా ఎక్కువైనా.. తక్కవైనా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు తమ తాజా పరిశోధనలో వెల్లడించారు. అంతేకాదు, నిద్ర హెచ్చు తగ్గుల కారణంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. అమెరాకాలోని వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీకి చెందిన భారతీయ శాస్త్రవేత్త అనూప్ శంకర్ బృందం నిద్రపై జరిపిన పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
 
అమెరికాలోని 30,000 మంది పెద్దవారిపై 2005లో వారు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ పరిశోధనలో రోజుకి ఏడు గంటలు నిద్రపోయే వారితో పోలిస్తే తొమ్మిది గంటలకుపైగా నిద్రపోయే వారికి గుండె సంబంధింత సమస్యలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నట్లు వారు తెలిపారు. ఎవరైతే ఐదు గంటలు లేదా అంతకన్నా తక్కువ సమయం నిద్రించే 60ఏళ్ళ వయస్సు ఉన్న వారిలో ఈ సమస్యలు మూడింతలు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.
 
ఈ పరిశోధన ప్రకారం, తక్కువ సమయం నిద్రించేవారు యాంగినా (శ్వాస ఆడకపోవటం) వంటి సమస్యతో, అలాగే ఎక్కువ లేదా తక్కువ సమయం నిద్రించేవారు గుండెపోటు, పక్షవాతం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. అయితే.. వయస్సు, స్త్రీ, పురుషులు, పొగ తాగేవారు, మద్యపాన ప్రియులు, బక్కపలచనివారు, ఊబకాయులు ఇలా అందరి విషయాల్లోనూ ఈ ఫలితాల ఒకే రకంగా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Sangareddy: అన్నం పాత్రలో కాలు పెట్టి హాయిగా నిద్రపోయిన వాచ్‌మెన్

బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు : ఆధిక్యంలో ఎన్డీయే కూటమి

Cold Wave: తెలంగాణలో చలిగాలులు.. శని, ఆదివారాల్లో పడిపోనున్న ఉష్ణోగ్రతలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీపై ఎగ్జిట్స్ పోల్స్ ఏం చెప్తున్నాయ్!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

తర్వాతి కథనం
Show comments