Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాగా జలుబు పట్టిందా.. అయితే ఇలా చేయండి..

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (11:57 IST)
చాలా మంది జలుబు చేసినప్పటికీ ఆఫీసులకు వెళుతుంటారు. పైగా, దాన్నిపెద్దగా పట్టించుకోకుండా తమ రోజువారి విధుల్లో నిమగ్నమైపోతారు. నిజానికి జలుబు చేసినట్టయితే చిన్నపాటి చిట్కాలు ఇంటిపట్టునే పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి వెళ్లడం సరైంది కాదు. అలాగే తల, శరీరం నొప్పులు, జ్వరం లాంటివి ఉన్నప్పుడు, తుమ్ములతో జలుబు మొదలైనప్పుడు పారాసిటమాల్ బిళ్లలు, వేపొరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదు. 
 
ఆయా సీజన్లలో వచ్చే జలుబులకు సరైన చికిత్స చేయకపోతే అవి క్రమంగా ఆస్తమాగా మారే అవకాశం ఉందని అలర్జీల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు చేసి తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మజీవులు ఇతరులకు వ్యాపించి వారికి కూడా జలుబు సోకుతుంది. అందువల్ల జలుబు చేసినప్పుడు ఆఫీసుకు వెళ్లి ఇతరులకు దాన్ని వ్యాపింపచేయడం కంటే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని నిపుణుల చెపుతారు. 
 
జలుబు సాధారణంగా 7 నుంచి 12 రోజులలో తగ్గుతుంది. ఇలాంటి వైరల్ వ్యాధులకు యాంటీ బయోటిక్స్ వాడటం కంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే మంచిది. వేడి నీటిలో పసుపు లేదా ఏదైనా బామ్ వేసి ఆవిరి పట్టడం లేదా మరిగిన నీటి ఆవిరిని పట్టి, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
 
చీదినప్పుడు, దగ్గినప్పుడు రక్తం పడుతుందా...? అని గమనించాలి. అలా రక్తం పడితే అది తీవ్రమైన రుగ్మతగా గమనించాలి. స్వల్పంగా తలనొప్పి, జలుబు అయినప్పుడు తగినంత విశ్రాంతి అన్నిటికి మంచిది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

అందాల పోటీలపైనే కాదు.. అగ్ని ప్రమాదాలపై కూడా దృష్టిసారించండి : కేటీఆర్

పెళ్లి చేసుకునేందుకు మండపానికి గుఱ్ఱంపై ఊరేగుతూ వచ్చిన వరుడు, ఎదురుగా వధువు శవం

తెలంగాణాలో మద్యం బాబులకు షాకిచ్చిన సర్కారు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

పెళ్లి పీటలెక్కనున్న విశాల్.. వధువు ఎవరంటే?

ఏస్ చిత్రంలో జూదం అనేది ఉప్పెనలాంటిదంటున్న విజయ్ సేతుపతి

తర్వాతి కథనం
Show comments