Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-10-2019- బుధవారం మీ రాశిఫలాలు - కళత్ర మొండివైఖరి మీకు...

Advertiesment
02-10-2019- బుధవారం మీ రాశిఫలాలు - కళత్ర మొండివైఖరి మీకు...
, బుధవారం, 2 అక్టోబరు 2019 (08:47 IST)
మేషం: కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. చిన్ననాటి వ్యక్తులను కలుసుకుంటారు. నూతన వ్యాపరాల్లో నిలదొక్కుకోవటానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు అధికారులతో పర్యటనలు, పర్యవేక్షణలో పాల్గొంటారు. దూర ప్రయాణాలో వస్తువులపట్ల మెళకువ అవసరం.
 
వృషభం: ఆర్థికస్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. దైవ కారాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు అలంకారాలు, విలాసవస్తువులు పట్ల ఆకర్షితులవుతారు. దాంపత్యసుఖం, మానసిక ప్రశాంతత చేకూరుతాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించటం మంచిదికాదు. 
 
మిధునం: విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు షాపింగ్‌‌ల కోసం ధనం ఖర్చుచేస్తారు. మత్స్య, కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కర్కాటకం: బంధువుల నుంచి మనస్ఫర్థలు తలెత్తుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతోచికాకు కలిగిస్తుంది. మధ్యవర్తిత్వాలు, వివాదాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ప్రముఖుల కలియిక ప్రయోజనకరంగా ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తుంది.
 
సింహం: రిప్రజెంటటేటివ్‌‌లు తమ టార్గెట్లను అతికష్టంమీద ఆలస్యముగానైనా పూర్తి చేస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు మెళుకువ అవసరం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆకస్మకంగా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. 
 
కన్య: హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. మీ ఉన్నతిని చాటుకోవటం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆకస్మికంగా ఆరోగ్యమైన సమస్యలు తలెత్తుతాయి. 
 
తుల: విద్యార్థులు ప్రేమ వ్యవహారాల్లో పెద్దల నుంచి విమర్శలను ఎదుర్కుంటారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. పరస్త్రీలతో అధికంగా సంభాషించడం మంచిది కాదు. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యతేగాని ఆర్థిక స్థితి ఆశించినంత సంతృప్తికరంగా ఉండదు. మీ చిన్నారుల ఆరోగ్యము గురించి ఆందోళన చెందుతారు.
 
వృశ్చికం: స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. బంగారు, వెండి, లోహ రంగాలలో వారికి మందకొడిగా వుండగలదు. బంధుమిత్రులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి.
 
ధనస్సు: విందులలో పరిమితి పాటించటం చాలా అవసరం. విలువైన కానుకలందించి ప్రముఖులను ఆకట్టుకుంటారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ ఇతర పోటీల్లో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యం, వాహన యోగం పొందుతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. శత్రువులు మిత్రులుగా మారి సహకారం అందిస్తారు.
 
మకరం: వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం మంచిది. పాత రుణాలు తీరుస్తారు. అనుకోకుండా ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. 
 
కుంభం: రాజకీయాలతో సంభాషించేటపుడు ఓర్పు, సంయమనం పాటించండి. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం.
 
మీనం: ఎదుటి వారిని గమనించి ఎత్తుకు పై ఎత్తువేయటం వల్ల గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఊహించని ఖర్చులు, తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకింత ఒడిదుకుడులను ఎదుర్కొంటార. శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎడమ చేతికి రుద్రాక్ష ధరిస్తే ఫలితం ఏమిటి?