Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

28-09-2019- శనివారం రాశిఫలాలు - ఆర్థిక విషయాల్లో కొంత...

webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (08:40 IST)
మేషం: టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. ప్రముఖులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి సహకరిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. విద్యార్థుల మొండి  వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
వృషభం: సంగీత, సాహిత్య, కళారంగాల్లో వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. ప్లీడర్లకు తమ క్లయింట్‌‌లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ ఉన్నతిని చూచి అసూయపడే వారు అధికమవుతున్నారని గమనించండి. 
 
మిధునం: వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. దైవదర్శనాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారితో మెళుకువ అవసరం. మీ ప్రమేయం లేకున్నా అకారణంగా మాటపడవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగయత్నం ఫలిస్తుంది. అధికారులకు హోదా మార్పు, స్థానచలనం. 
 
కర్కాటకం: ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బంది తప్పక పోవచ్చు. దూర ప్రయాణాలు చేస్తారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. ముఖ్యులతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. వాతావరణంలో మార్పు వల్ల చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం అవుతాయి.
 
సింహం: బంధు మిత్రుల కలయికతో మీలో నూతన ఉత్సాహం నెలకొంటుంది. ఔషద సేవనం తప్పకపోవచ్చు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ముఖ్య విషయాల్లో బంధు మిత్రుల నుండి వ్యతిరేకత తలెత్తే ఆస్కారం ఉంది. అనుకున్న పనులు కొంత ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికి సకాలంలో పూర్తిచేస్తారు.
 
కన్య: ఆర్థిక విషయాల్లో అనుకున్నంత సంతృప్తి. విద్యార్థులు తమ లక్ష్యం సాధించటానికి అధిక కృషి చేయవలసి ఉంటుంది. ఒకలేఖ మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వస్త్ర, బంగారం, వెండి రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబాభివృద్ధికై మీరు చేసే యత్నాలు ఫలిస్తాయి. ఆహార వ్యవహారాల్లో మెళుకవ అవసరం.
 
తుల: వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఆరోగ్య విషయంలో ఆలక్ష్యం తగదు. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. మీ జీవితభాగస్వామిలో మార్పు మీకెంతో ఊరటనిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. భూవివాదాలు, స్థిరాస్తి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం: వృత్తి వ్యాపారులకు శుభదాయకం. నిరుద్యోగులకు సదలకాశాలు లభిస్తాయి. ముఖ్యులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది.
 
ధనస్సు: ఆథ్యాత్మిక చింతన పెరుగుతుంది. విశ్రాంతి లోపము వల్ల ఆరోగ్యంలో సంతృప్తి కానరాదు. వృత్తివ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతారు. ఇతరుల విషయాలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం మంచిది. స్ఫెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం.
 
మకరం: దైవదర్శనాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకతో ఖర్చులు అధికం. ఉపాధ్యాయులకు ఆరోగ్య భంగం, ప్రశాంతత లోపం వంటి చికాకులు ఎదుర్కుంటారు. వ్యాపారాభివృద్ధికి నూతన యత్నాలు మొదలెడతారు. ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు ఫలించవు. కొంత మంది మిమ్మల్ని మధ్యవర్తిత్వం వహించని కోరతారు.
 
కుంభం: వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో అప్రమత్తత అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
 
మీనం: ఆర్థికలావాదేవీలు, వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించాలి. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు మాటపడవలసి వస్తుంది. ఆత్మీయులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

కుడి భుజం అదిరితే ఏం జరుగుతుందో తెలుసా?