Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిగుడ్డును ఎలా తింటున్నారు?

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (23:03 IST)
ఒక్కో కోడిగుడ్డులో 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ గుడ్డులో ఎక్కడ ఉంటుందో తెలుసా...? గుడ్డు లోపలి పసుపుపచ్చని పదార్థంలోనే ఉంటుంది. కనుక ఒక గుడ్డును తినేవారికి ఎంచక్కా 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ చేరడం ఖాయం. ఐతే రోజుకు ఓ వ్యక్తికి కావలసిన కొలెస్ట్రాల్ కేవలం 300 మిల్లీగ్రాములు మాత్రమే. ఒక్క గుడ్డుతోనే 212 మి.గ్రా చేరిపోతే, ఇక సాయంత్రంపూట తినే మిరపకాయ్ బజ్జీలు, గారెలు, పకోడీలు.. వగైరా వగైరా తింటే, ఇక చెప్పేదేముంది... ఏకంగా 500 మి.గ్రాలు ఇంకా అంతకుపైనే చేరిపోవడం ఖాయం. 
 
ఇలా రోజులో మోతాదుకు మించిన కొలెస్ట్రాల్ రక్తనాళాల్లోకి చేరి పేరుకుపోతుంటే అనారోగ్యం రాక ఏమవుతుంది. అంతేకాదండోయ్... ఇంకో సీరియస్ వ్యవహారం. ఇలా కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరంలో పెరిగిపోతే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వీటిని నిరోధించాలంటే.. ముందుగా ఈ గుడ్డుపై కొద్దిగా టార్గెట్ పెట్టి తీరాల్సిందే. 
 
ఏదేమైనప్పటికీ గుడ్డు రుచి చూడాలని జిహ్వ కొట్టుకుంటుంటే మాత్రం, గుడ్డు లోపలి పసుపుపచ్చ పదార్థం తీసేసి తెల్లని పదార్థాన్ని తినవచ్చు. ఎందుకంటే అందులో కొలెస్ట్రాల్ ఉండదు. కనుక... గుడ్డు తినేటపుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తినండి మరి. అలాగని టోటల్‌గా గుడ్డును మీ ఆహారం నుంచి తీసేయకండలా... కాస్త చూసుకుని తినండి. మీ ఆరోగ్యం వెరీ"గుడ్డు"గా ఉంటుంది. మీ ఆరోగ్యం మీ కుటుంబానికి మహాభాగ్యం.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments