బీట్‌రూట్ రసం తాగిన 24 గంటల్లో..?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (15:51 IST)
కూరగాయలన్నీ పోషణను మాత్రమే ఇస్తాయి అనుకుంటే పొరపాటు. చాలా కూరగాయలు అనేక వ్యాధులకు ఔషధంగా కూడా పనిచేస్తాయి. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సహజసిద్ధంగా వ్యాధులను నయం చేస్తాయి. వాటిలో బీట్ రూట్ కూడా ఒకటి. అధ్యయనాల ప్రకారం నైట్రేట్‌ అధికంగా ఉన్న కూరగాయలను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. 
 
మన శరీరానికి నైట్రేట్‌ను నైట్రిట్‌ అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్‌ ఆక్సైడ్‌గా మార్చే గుణం ఉంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి మాత్రలకు బదులుగా 200 మిలీ బీట్‌రూట్‌ రసాన్ని ఇచ్చి 24 గంటలపాటు పరిశీలనలో ఉంచారు. 
 
ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. అంతే కాకుండా మరో 24 గంటలపాటు రక్తపోటు నియంత్రణలో ఉంది. అందువల్ల హైబీపీతో బాధపడేవారు నైట్రేట్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు తరచుగా తినమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అపుడు నన్ను ఓడించారు... ఇపుడు నా భార్యను గెలిపించండి...

భాగ్యనగరిలో వీధి కుక్కల బీభత్సం - ఎనిమిదేళ్ళ బాలుడిపై దాడి

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

తర్వాతి కథనం
Show comments