బీట్‌రూట్ శరీరానికి ఎన్నో విధాల మేలు చేస్తుంది. మంచి పోషణను శరీరానికి అందిస్తుంది. కురుల సంరక్షణకు కూడా ఇది తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్‌లో అనేక ఔషధాలు ఉన్నాయి. అవి జుట్టు రాలిపోవడం వంటి సమస్యల నుండి కాపాడుతాయి. అయితే కేశ సంరక్షణ కోసం బీట్‌రూట్‌ని ఎలా ఉపయోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిగా ఏడు లేదా ఎనిమిది బీట్‌రూట్ ఆకులను ఉడికించాలి. ఆ తర్వాత వీటిని ఐదారు గోరింటాకులతో కలిపి మెత్తగా రుబ్బి మిశ్రమంగా చేయాలి. ఈ పేస్ట్‌ని మాడుకు రాసుకుని 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేయాలి. ఇలా చేస్తే జుట్టు బలంగా ఉండటంతోపాటు రాలిపోకుండా ఉంటుంది. సరైన పోషణ అందుతుంది.
ఈ చిట్కాలను పాటించడమే కాకుండా ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అప్పుడే జుట్టు రాలడాన్ని పూర్తిగా నివారించవచ్చు. బీట్‌రూట్ జుట్టు పెంచే విధానానికి తల్లిలాంటిదని వైద్యులు చెబుతున్నారు. చర్మరక్షణకి కూడా అనేక విధాలుగా బీట్‌రూట్ సహాయపడుతుంది. బీట్‌రూట్‌ని మీ డైట్‌లో భాగం చేసుకోండి మరియు ఫిట్‌గా ఉండండి.