ఆయాసం, పిల్లికూతలు, ఏం చేయాలి?

Webdunia
శనివారం, 29 మే 2021 (23:21 IST)
తరచూ జలుబు చేయడం, జలుబుతో ఎక్కువ రోజులు బాధపడటం అనేది సైనస్ వ్యాధి ప్రాథమిక లక్షణం. ఆ తర్వాత దశలో జలుబు చేసినప్పుడు ముక్కులు బిగదీసుకుపోవడం వుంటుంది. తల బరువుగా అనిపించడమే కాకుండా ముక్కు నుంచి ఆకుపచ్చని, పసుపచ్చని ద్రవం కారుతుంటుంది. ఆస్తమాలో ప్రధానంగా కనిపించేవి దగ్గు, ఆయాసం, పిల్లికూతలు. కొందరిలో అయితే దగ్గు మాత్రమే కనిపిస్తుంది. ఛాతీ పట్టేసినట్లు బరువుగా అనిపిస్తుంది.
 
దీన్ని నిరోధించేందుకు హోమియో మందులు కూడా వున్నాయి. ఈ మందుల వల్ల ఆస్తమాను శాశ్వతంగా నిరోధించవచ్చని వైద్యులు చెపుతున్నారు. ఇంగ్లీషు మందుల ద్వారా ఆస్తమాను తరిమేయడం సాధ్యం కాదని అంటున్నారు. ఈ క్రింది చిట్కాలతో కూడా ఆస్తమాను నిరోధించవచ్చు.
 
1. ఉల్లిపాయలు- వీటిలో యాంటీ ఇన్‌ప్లమేటరీ, యాంటీ ఆస్త్మాటిక్ ప్రభావాలున్నాయి. ఉల్లి తినడం వల్ల బ్రోంకియల్ అబ్‌స్ట్ర్క్షన్‌ తగ్గుతుంది.
 
2. నారింజ- కమలా, నారింజ, నిమ్మలలో ఉండే విటమిన్‌ సి ఉబ్బస లక్షణాలు తగ్గిస్తుందని వైద్యులు చెపుతున్నారు. కాబట్టి వీటిని తీసుకుంటే సమస్య తగ్గుతుంది.
 
3. యాపిల్- వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ ఆస్తమాతో ఇబ్బంది పడేవారి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్ పైన తొక్క ముదుర రంగులో లైకోఫిన్ ఎక్కువగా ఉన్నందున యాంటిఆక్సిడెంట్‌గా  ఆస్త్మా రోగులకు మేలు చేస్తుంది.
 
4. పాలకూర- ఇందులో మెగ్నీషయం వుంటుంది. ఆస్త్మా లక్షణాలను తగ్గించడంలో ఇది బాగా సహకరిస్తుంది. ఆస్తమా వున్నవారికి రక్తంలోనూ, టిష్యూలలోను మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడము వల్ల ఆస్త్మా సమస్య తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీ-నీట్‌ 2026కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం - టెలిగ్రామ్ సేవలు నిలిపివేత

హోర్ముజ్ జలసంధి ద్వారా టోల్ ఫ్రీ షిప్పింగ్ ప్రారంభం.. డొనాల్డ్ ట్రంప్

ఆస్ట్రేలియన్లు వార్తా పత్రికలు చదవట్లేదట.. కారణం ఏంటంటే?

మల్కాపురంలో నావికాదళ అధికారి భార్య ఆత్మహత్య

వైమానిక దళ అధికారి భార్యపై అత్యాచారానికి పాల్పడిన పాత స్నేహితులు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: సీఎం విజయ్ చెప్పినట్లు చేశానంటున్న విశాల్

యూట్యూబర్ ఖలీద్‌తో బ్రేకప్ చెప్పేసిన నటి సునైనా?

Peddi Article: పెద్ది కలెక్లన్ల ద్వారా తెలుగు ఇంఢస్ట్రీ ఏం నేర్చుకుంది? ఇంకా ఏం నేర్చుకోవాలి?

శ్రీనగర్ యువతిని పెళ్లాడిన ఊర్మిళా మాటోండ్కర్ మాజీ భర్త

Samantha: హిట్లతో అహంకారం పెరిగింది, రిటైర్మెంట్ ఆలోచించలేదు : సమంత ప్రభు

తర్వాతి కథనం
Show comments