Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతాలపై ఈ నూనెతో మర్దన చేస్తే మిలమిలలాడుతాయి

Webdunia
శనివారం, 29 మే 2021 (23:15 IST)
నువ్వుల నూనె దంత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూట దీంతో చిగుళ్లను వేళ్లతో అద్ది రుద్దాలి. చిగుళ్ల ఆరోగ్యంగా, గట్టిగా ఉంటాయి. ఈ నూనెతో అలర్జీలు వస్తాయన్న భయం కూడా లేదు. దంతాలు తెల్లబడాలనుకునేవారు ఇలా కొబ్బరినూనెతోనూ ప్రయత్నించవచ్చు.
 
తలకి సంబంధించినంత వరకూ ఆముదం, భృంగరాజ్, ఆలివ్, కొబ్బరి, మందార నూనెలు మేలు చేస్తాయి. ఇవి జట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తాయి. వీటిని విడివిడిగా కానీ, కలిపికానీ వాడుకోవచ్చు. షాంపుతోపాటు ఇలా రెండుమూడు చక్కల నూనె వాడితే తలస్నానానికి కండిషనర్‌తో పనుండదు. 
 
ఆముదం కనుబొమల అందానికి ఎంతో ఉపకరిస్తుంది. రెండుమూడు చుక్కల ఆముదాన్ని పట్టించి రాత్రంతా వదిలేయండి. ఇందులోని మాంసకృత్తులు కనుబొమలు ఒత్తుగా పెరిగేందుకు సహకరిస్తాయి. పాత మస్కారా బ్రష్‌ని ఆముదంలో ముంచి అద్దితే వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి.
 
యాక్నె వంటి సమస్యలుంటే టీట్రీ నూనె చక్కగా ఉపయోగపడుతుంది. ముఖంపై మచ్చలు పోవడానికి విటమిన్ 'ఇ' నూనె వాడటం మేలు. చేతివేళ్లు బాగా పొడిబారి తెగినట్లు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు గోళ్ల చుట్టూ ఉన్న చర్మంపైకి లేచి ఇబ్బందిపెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు బాదం నూనె రాస్తే అక్కడి చర్మానికి తేమ అంది ఆరోగ్యంగా మారుతుంది. 
 
పాదాలు పొడిబారితే... ముందుగా గోరువెచ్చని నీటితో పాదాలు శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత రెండు చుక్కలు పెప్పర్‌మింట్ నూనె కలిపిన ఆలివ్ నూనె అరి పాదాలకు రాస్తే సమస్య తగ్గుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments