Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా..?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (17:47 IST)
కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్స్ వంటివాటితో పాటు టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో శరీరానికి శ్రమ తగ్గిపోయింది. కానీ కంటికి శ్రమ ఎక్కువైపోయింది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడంతో పాటు చేతుల్లో స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో కంటికి శ్రమ పెరిగిపోవడంతో పాటు కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇలాంటి సమస్యల నుండి బయటపడేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ఎక్కువ సమయం కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేసేవారు ప్రతి 20 నిమిషాలకోసారి కొన్ని సెకన్లపాటు విరామం తీసుకుని ఓ 20 అడుగుల దూరంలో ఉన్న ఏదో ఒక వస్తువుని చూడాలి. అలా చేయడం ద్వారా కళ్ళు నీరుకారడం, ఎర్రబారడం, దురద మంట రావడం, పొడిబారడం వంటి సమస్యలను అధిగమించవచ్చు. అంతేకాదు పని మధ్యలో కొన్నిసార్లు లేచి 20 అడుగులు నడవడం వలన శారీరక వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. 
 
అలాగే కంటి కోసం ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు వారానికి రెండుసార్లు చేపలు.. నెలకోసారి మాంసం తీసుకునే వారిలో కంటి సమస్యలు ఉండవని రోజూ ఒక గ్లాసుడు క్యారెట్ జ్యూస్ సేవిస్తే కంటికి ఎంతో మేలు చేసినవారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments