Webdunia - Bharat's app for daily news and videos

Install App

తోటకూరలో ఏముందిలే అనుకుంటే?

తోటకూర తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసుకుందాం.. పిల్లలు పుష్ఠిగా, బలంగా పెరగాలంటే.. ఎముకలకు బలాన్నిచ్చే తోటకూరను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, మూడు పదుల వయస్స

Webdunia
మంగళవారం, 26 జూన్ 2018 (14:53 IST)
తోటకూర తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసుకుందాం.. పిల్లలు పుష్ఠిగా, బలంగా పెరగాలంటే.. ఎముకలకు బలాన్నిచ్చే తోటకూరను ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వృద్ధులు, మూడు పదుల వయస్సు దాటినవారు.. వయోబేధం లేకుండా తోటకూరను రోజుకో కప్పు ఆహారంలో చేర్చుకుంటే.. ఎముకలకు మేలు చేసినవారవుతారు. 
 
ఎముకల బలం తగ్గడం, ఎముకల అరుగుదల వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. రోజు తోటకూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. తోటకూరతో పాటు గోంగూర, మునగాకును ఆహారంలో చేర్చుకుంటే.. ఎముకలు బలపడతాయి. 
 
తోటకూర రసం అరగ్లాసు లేదా గ్లాసుడు తీసుకుని రెండు స్పూన్ల అల్లం రసం చేర్చి.. అర స్పూన్ బ్రౌన్ షుగర్ చేర్చి మరిగించి.. వడగట్టి రోజూ ఓ స్పూన్ మేర 48 రోజులు తీసుకుంటే.. ఎముకలకు సంబంధించిన రోగాలు దూరమవుతాయి. ఎముకల్లో క్యాల్షియం శాతం పెరుగుతుంది. తోటకూరలో ఇనుము, విటమిన్ ఎ, సీ, క్యాల్షియం పుష్కలంగా వున్నాయి. 
 
పీచు, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ డికి తోటకూరలో లోటుండదు. బరువు తగ్గాలనుకునేవారు తోటకూరను ఆహారంలో చేర్చుకోవాలి. హైబీపీని తోటకూర తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 
 
ఇకపోతే.. ఓ పాత్రలో వెన్న రెండు స్పూన్లు చేర్చి.. మునగాకు ఓ గుప్పెడు అందులో చేర్చి వేయించాలి. ఇందులోనే రాగిపిండి, ఉప్పు, మిరియాల పొడి చేర్చి ఉడికించాలి. ఇలా ప్రతీరోజూ మునగాకును వెన్నలో వేయించి తీసుకుంటే.. మెడనొప్పి, నడుము నొప్పి మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments