ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

సిహెచ్
గురువారం, 26 జూన్ 2025 (23:05 IST)
ఆల్‌బుకరా పండ్లలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల ఇవి రోగనిరోధకశక్తిని పెంచి, త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడతాయి. మనం తిన్న ఆహారం నుంచి శరీరం ఇనుమును బాగా గ్రహించేలా కూడా చేస్తాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండులోని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాము.
 
జ్యూసీగా ఉండే ఈ ఆల్‌బుకరా పండులో కేలరీలు తక్కువ, జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్‌ ఇందులో చాలా వుంది.
వీటిల్లోని ప్రోసైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ వంటి ఫెనోలిక్‌ రసాయనాలు శరీరంలో కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. 
రోగనిరోధకశక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతాయి. విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌లూ ఇందులో ఉన్నాయి.
ఆల్‌బుకరా పండ్లలో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా కాపాడుతుంది.
ఈ పండులోని విటమిన్‌ కె ఎముకల పటిష్టతను కాపాడటానికి, అల్జీమర్స్‌ను నయం చేయడానికి సాయపడుతుంది.
ఆల్‌బుకరా పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది.
ఎండు ఆల్‌బుకారాలను రోజుకు పది చొప్పున తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారై ఎముక విరుపు సమస్యలుండవు.
మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో సాధారణంగా కనిపించే ఆస్ట్రియోపోరోసిస్‌ని కూడా ఇవి నివారిస్తాయని నిర్ధారించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న

17వ వార్షిక రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

ప్రియురాలి కోసం లండన్ నుంచి వచ్చిన ప్రియుడు.. చివరకు విగతజీవిగా మారాడు.. ఎలా?

Amaravati: అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ప్రారంభానికి రెండేళ్లు పట్టే అవకాశం..

డిసెంబర్ 4 నుండి రెండు రోజుల పాటు భారత పర్యటనలో పుతిన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

మంచి ప్రేమ కథతో వస్తున్న లవ్ డేస్ పెద్ద విజయం సాధించాలి : సముద్ర

తర్వాతి కథనం
Show comments