Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో వేడివేడి బజ్జీలొద్దు.. నెయ్యిని పక్కనబెట్టేయాల్సిందే..

వర్షాకాలంలో దాహం వేయదు. చెమట పట్టదు. వ్యాయామం చేయాలనిపించదు. శారీరక శ్రమ అంతగా వుండదు. ఇంకా వాతావరణం చల్లగా వుండటంతో నోరూరించే వేడి వేడి పదార్థాలను ఎక్కువగా లాగించేయాలనిపిస్తుంది. కానీ వర్షాకాలంలో గాన

Webdunia
గురువారం, 12 జులై 2018 (11:43 IST)
వర్షాకాలంలో దాహం వేయదు. చెమట పట్టదు. వ్యాయామం చేయాలనిపించదు. శారీరక శ్రమ అంతగా వుండదు. ఇంకా వాతావరణం చల్లగా వుండటంతో నోరూరించే వేడి వేడి పదార్థాలను ఎక్కువగా లాగించేయాలనిపిస్తుంది. కానీ వర్షాకాలంలో గానీ, శీతాకాలంలో కానీ నూనెల్లో వేయించిన పదార్థాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇష్టమొచ్చినట్లు ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవడమే కాకుండా, బరువు పెరిగిపోతారని వారు హెచ్చరిస్తున్నారు. అలా వర్షాకాలంలో బరువు పెరగకుండా వుండాలంటే.. వేడి వేడి, నూనెలో వేపే బజ్జీలు, సమోసాలు వంటి ఆహార పదార్థాలకు దూరంగా వుండాలి. ఇంకా తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా వుండటం మంచిది. అలాగే పార్టీలకు వెళ్లినా.. అక్కడ వెరైటీలు కంటి ముందు కనిపిస్తున్నా.. మితంగా తినాలి. 
 
నూనెతో చేసిన పదార్థాలకు దూరంగా వుండాలి. నెయ్యిని పక్కనబెట్టేయాల్సిందే. రాత్రిపూట మితంగా తీసుకోవడం.. ఒక వేళ మాంసాహారం తీసుకుంటే, పండ్లు, సలాడ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా ఆకుకూరలు, పండ్లు, డ్రై ప్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో 81.86 శాతం.. పిఠాపురంలో 86.36 శాతం పోలింగ్ : ముకేశ్ కుమార్ మీనా

బోరబండ వద్ద మేకప్ ఆర్టిస్టును హత్య చేసిన దుండగులు

భర్తతో కలిసి వుండటం ఇష్టం లేదు.. ప్రియుడితో రెండు నెలల గర్భిణి పరార్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

తర్వాతి కథనం
Show comments