Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు పెరగకూడదా.. పెరిగినా పర్లేదు.. ఇవి తింటే చాలు..?

Webdunia
శుక్రవారం, 8 అక్టోబరు 2021 (15:04 IST)
బరువు పెరగకుండా వుండాలంటే.. ఈ టిప్స్ పాటిస్తే చాలు. అంతేగాకుండా పెరిగిన బరువును కూడా ఈ ఆహారం తగ్గిస్తుంది. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి చేపలు సహకరిస్తాయి. ఇందులో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు రక్తంలో హానికర ట్రైగ్లిజరైడ్లను చేరకుండా అడ్డుకుంటాయి. 
 
కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపలోని కొవ్వులోనే ఉంటాయి. కనుక కొవ్వు పట్టిన సాల్మన్, సార్ డైన్, టూనా వంటి చేపలు తినడం మంచిది. కాకపోతే వీటిని కూరగా వండుకునే తినాలి కానీ, నూనెలో వేయించుకుంటే మాత్రం బరువు పెరుగుతారు.
 
చిరుతిళ్లుగా బాదం, జీడిపప్పు, పిస్తా వంటి ఓ గుప్పెడు తింటే చాలు. వీటిలో కూడా కొవ్వును తగ్గించే గుణాలు ఎక్కువ. కాకపోతే అధికంగా తింటే మాత్రం కొవ్వు పట్టేస్తుంది. వీటి వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది.
 
బ్రేక్ ఫాస్ట్ టైమ్‌లో దోశెలు, పూరీలు, బోండాలు తినడం మానేస్తే అధిక బరువు సమస్య ఎదురుకాదు. బ్రౌన్ రైస్, జొన్నలు, ఓట్స్, సజ్జలు వంటి చిరు ధాన్యాలతో చేసిన వంటకాలు తింటే త్వరగా ఆకలి వేయదు. కాబట్టి అధికంగా తినే అవకాశం ఉండదు, తద్వారా బరువు అదుపులో ఉంటుంది.
 
 ఏమి తిన్నా కూడా బరువు తగ్గడానికి ఎక్కువ సాయం చేసేది వ్యాయామం. తినేసి కూర్చుంటే ఎవరైనా బరువు పెరుగుతారు. రోజులో ఒక గంట పాటూ వేగంగా నడక అలవాటు చేసుకుంటే మంచిది. దీని వల్ల పక్షవాతం, గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.
 
ఒత్తిడి... ఆధునిక కాలంలో ఎక్కువమంది ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తున్న మహమ్మారి ఇది. అధిక ఒత్తిడి బరువు పెరిగేందుకు కూడా సహకరిస్తుంది. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరుగుతుంది, కొలెస్ట్రాల్ శాతం కూడా ఎక్కువ కావచ్చు. అందుకే ధ్యానం, యోగా లాంటి వాటితో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరుదైన విదేశీ పాములు.. ఎలా వచ్చాయంటే?

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

తర్వాతి కథనం
Show comments