కోడిగుడ్డులోని పచ్చసొన తినకుండా పారేస్తున్నారా? (video)

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (15:48 IST)
చాలా మంది కోడిగుడ్డులోని తెల్లది ఆరగించి... లోపల ఉన్న పచ్చ సొనను పారేస్తుంటారు. దీనికి కారణం... ఈ పచ్చ సొన తినడం వల్ల ఆరోగ్యానికి హాని చేస్తుందనీ, రక్తనాళాలను మూసివేస్తుందని, బరువు పెరుగాతన్న భ్రమలో చాలా మంది ఉంటారు. నిజంగా ఈ పచ్చ సొన తినడం మంచిదా కాదా అనే విషయాన్ని తెలుసుకుందాం. 
 
గుడ్డు సంపూర్ణ పోషకాల నిలయం. అయితే పచ్చసొన తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. అందులో కొలెస్ట్రాల్‌ ఉండడమే అలా అనుకోవడానికి కారణం. దీంతో గుడ్డులోని పచ్చసొన తింటే రక్తంలో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయని కొంత మంది దానిని తినడం మానేస్తున్నారు. 
 
అయితే అది కేవలం అపోహ మాత్రమేనని.. అందులో ఏ మాత్రం నిజం లేదని.. గుడ్డులో అధిక మొత్తంలో కొవ్వు కలిగి ఉన్నప్పటికీ దీని ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మాత్రం పెరగవని ఆరోగ్య పనిపుణులు చెబుతున్నారు.
 
పచ్చసొనను తినకపోవడం వల్ల ముఖ్య పోషకాలైన కొలైన్, సెలీనియం, జింక్‌తోపాటు విటమిన్ ఎ, బి, ఇ, డి, కె కూడా కోల్పోతారు. బి కాంప్లెక్స్, విటమిన్ డిలకు ప్రధాన వనరుగా గుడ్డును పేర్కొంటారు. పచ్చసొనలో ఐరన్ శాతం అధికం. దాన్ని మన శరీరం సులువుగా గ్రహిస్తుంది. 
 
గుడ్డులో ఉండే ల్యూటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంటు కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. పలు జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు గుడ్డులోని పోషకాలు సహకరిస్తాయి. అంతేకాదు పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువే ఉంటాయి. కాబట్టి తిన్నా బరువు పెరుగుతారన్న బెంగ లేదు. నిశ్చింతగా గుడ్డు మొత్తం తినొచ్చు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

40 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు

అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఎస్‌యూవీలో వచ్చి ఎత్తుకెళ్లారు..

విజయ్ సర్కార్ అదుర్స్ .. లంచం తీసుకునే అధికారులకు షాక్.. లక్ష నజరానా

రేణుకాస్వామి హత్య కేసు.. దర్శన్ ఆత్మహత్యాయత్నం..? జైలులో దర్శన్‌ను కలిసిన కుటుంబం

కాలువలో శవమై తేలిన యువ గాయని... ఎవరు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: చిరంజీవి గారి సలహా స్పూర్తి,. బుచ్చిబాబు వల్ల చేతికి గాయం : రామ్ చరణ్

Sudheer Anand: సుడిగాలి సుధీర్ ఇకపై సుధీర్ ఆనంద్ గా హై లెస్సో చిత్రంతో రాబోతున్నాడు

Dragon Glimpse: డ్రాగన్ గ్లింప్స్ లో ఉన్మాదంతో ఎన్.టి.ఆర్. జీవించాడంటున్న అభిమానులు

త్రిష కృష్ణన్‌ బ్యూటీ సీక్రెట్ అదే.. చీరలంటే ఆమెకు చాలా ఇష్టం

ఐక్య నా బిడ్డ లాంటిది, మా ఈ ట్రస్ట్ వాయిస్‌లెస్‌కి వాయిస్‌గా ఉంటుంది: మనోజ్ మంచు

తర్వాతి కథనం
Show comments