ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? (video)

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (06:36 IST)
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగేవారికి ఎసిడిటీ వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా మీ జీర్ణాశయంలో యాసిడ్, ఆల్కలీన్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది.

ఇతర పోషకాలను శోషించుకోవడాన్ని టీ నిరోధిస్తుంది. మీ మెటబాలిక్ సిస్టమ్, జీర్ణక్రియపై  తీవ్ర ప్రభావం చూపుతుంది. అల్సర్, స్కెలెటల్ ఫ్లోరోసిస్ అనే వ్యాధి బారిన పడతారు. అందుకే ఖాళీ కడుపుతో టీ తాగకండి. ఉదయం టిఫిన్ చేసిన గంట తర్వాత టీ తాగొచ్చు.

నిద్రలేమి సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. రాత్రి త్వరగా భోజనం చేసి బెడ్‌పై పడుకున్నా.. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు.

నిద్ర పోయే ముందు దీన్ని ఒక గ్లాస్ తాగితే మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు....!
 
నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం, రోజూ ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవడం, ఇతర మానసిక సమస్యలు, ఫోన్లను ఎక్కువగా రాత్రి పూట ఉపయోగించడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్య వస్తోంది. అయితే అందుకు ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. నిద్రలేమి సమస్యను తగ్గించుకునేందుకు పాలు, తేనె అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో సెడేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. రాత్రి భోజనం అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో 1 టీస్పూన్ తేనెను కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. కనీసం ఇలా వారం పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం ఉంటుంది.
 
2. పాలలో తేనె కలిపి తాగుతున్నా నిద్ర పట్టడం లేదని భావించే వారు అశ్వగంధ చూర్ణం వాడవచ్చు. పాలలో ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణం కలిపి తీసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించడంలో అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. నిద్ర వచ్చేలా చేస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కనుక పాలలో 1 టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తీసుకోవచ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళిస్తున్న త్యాగధనులు, ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు?

కర్నాటక సీఎం సిద్ధు రాజీనామాకు గవర్నర్ ఆమోదం

ఒంటరి మహిళపై అత్యాచారం - సీఐ పరారీ... ఆచూకీ కనిపెట్టని పోలీసులు

ఒకవైపు శాంతి చర్చలు.. మరోవైపు యుద్ధం.. యూస్ వార్ ఫ్లైట్‌ను కూల్చేసిన ఇరాన్

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

తర్వాతి కథనం
Show comments