Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట ఆఫ్ బాయిల్, ఆమ్లెట్ తీసుకుంటున్నారా?

నేటి తరం యువత ఫాస్ట్ ఫుడ్‌కు బాగా అలవాటుపడింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే ఫ్రైడ్ రైస్, చికెన్, మటన్, ఎగ్ అంటూ రాత్రిపూట అధికంగా లాగించే యువకుల్లో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు హె

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (15:32 IST)
నేటి తరం యువత ఫాస్ట్ ఫుడ్‌కు బాగా అలవాటుపడింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో లభించే ఫ్రైడ్ రైస్, చికెన్, మటన్, ఎగ్ అంటూ రాత్రిపూట అధికంగా లాగించే యువకుల్లో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా రాత్రిపూట యువకులు ఆఫ్ బాయిల్, ఆమ్లెట్ అంటూ కోడిగుడ్లతో తయారైన ఐటమ్స్‌ను తీసుకోకపోవడం మంచిది. ఒక వేళ తీసుకుంటే మాత్రం అజీర్తి సమస్యలు ఏర్పడతాయి.
 
రాత్రిపూట ఆమ్లెట్ తీసుకుంటే అంత సులువుగా జీర్ణం కాదు. అందుకే ఉడికించిన కోడిగుడ్లను ఉదయం లేదా మధ్యాహ్నం పూట తినాలి. రాత్రిపూట మాంసాహారాన్ని తీసుకోవడం చాలామటుకు తగ్గించడం మంచిది. ఇలా చేస్తే మూడు పదుల్లో డయాబెటిస్, ఒబిసిటీ వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ రాత్రిపూట మాంసాహారం తీసుకోవాల్సి వస్తే మోతాదుకు మించకుండా తీసుకోవాలి. 
 
చికెన్ అయితే అరకప్పు, గుడ్డు తీసుకోవాల్సి వస్తే తెల్లసొన మాత్రం ఆమ్లెట్ వేసి తీసుకోవాలి. ఎందుకంటే కోడిగుడ్డులో పసుపు సొనలో కొవ్వు అధికంగా వుంటుంది. దీన్ని రాత్రి పూట తినడం మానేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అదే ఉదయం పూట కోడిగుడ్డు ఆమ్లెట్ తీసుకుంటే ఆ రోజుకు కావలసిన శక్తిని ఇస్తుంది. ఇందులోని పీచు బరువును తగ్గిస్తుంది. ఇంకా ఒబిసిటీకీ దూరంగా వుండాలంటే కోడిగుడ్డులోని తెల్లసొనను మాత్రమే వంటల్లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments