Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉదయం... మధ్యాహ్నం... రాత్రి.... ఏం తీసుకోవాలి...?

రోజులో 24 గంటలు. తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించేవరకు ఉరుకులు పరుగులే. ఇదీ నేటి యువత జీవనమయం. ఈ క్రమంలో వేళకు సరైన భోజనం చేయరు. ఆ సమయానికి ఏదో ఒకటి లాగించేస్తుంటారు. తద్వారా అనారోగ్యా

ఉదయం... మధ్యాహ్నం... రాత్రి.... ఏం తీసుకోవాలి...?
, మంగళవారం, 21 మార్చి 2017 (09:04 IST)
రోజులో 24 గంటలు. తెల్లవారి లేచింది మొదలు రాత్రి నిద్రకు ఉపక్రమించేవరకు ఉరుకులు పరుగులే. ఇదీ నేటి యువత జీవనమయం. ఈ క్రమంలో వేళకు సరైన భోజనం చేయరు. ఆ సమయానికి ఏదో ఒకటి లాగించేస్తుంటారు. తద్వారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. 
 
ముఖ్యంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనం ఎక్కువ మంది అనుసరించే విధానం. కానీ, కొందరు తమకు నచ్చినట్టు, తమకు వీలుపడిన సమయంలో ఏ ఆహారం అంటే ఆ ఆహారాన్ని తీసుకుంటుంటారు. మరికొందరు ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తుంటారు. కానీ, అన్నపానీయాల విషయంలో సమయ నియమాలు ఉన్నాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో.. అలా ఎందుకు చేయాలో ఓ సారి పరిశీలిద్ధాం. 
 
సాధారణంగా రోజులో ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు దేహానికి ఎక్కువ కేలరీలు అవసరం అవుతాయి. అందుకే అల్పాహారం, లంచ్ తగినంత తీసుకోవాలి. రాత్రుళ్లు విశ్రాంతికి వెళతాం గునుక డిన్నర్ స్వల్పంగా తీసుకోవడం ఉత్తమం. ఒకవేళ లంచ్ తక్కువగా, డిన్నర్ ఎక్కువగా తీసుకోక తప్పని పరిస్థితిలో ఉన్నవారు కనీసం డిన్నర్‌లో తీసుకునే ఆహారం చాలా తక్కువ కేలరీలు ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కూరగాయలు, సలాడ్ ఎక్కువ తీసుకోవాలి.
 
నిద్రకు సమయం దగ్గర పడుతున్న వేళల్లో తినే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటే రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. దాంతో నిద్ర తొందరగా రాదు. పట్టినా ఆ నిద్ర అంత గాఢంగా ఉండదు. ముఖ్యంగా రాత్రి డిన్నర్ తర్వాత ఇంకే ఆహారం తీసుకోవద్దు. కొందరు తియ్యటి పదార్థాలు, ఫ్రిజ్‌లో నుంచి ఐస్ క్రీమ్ తీసుకుని తింటుంటారు. ఇది మరీ ప్రమాదకరం. చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ఇవి మెలటోనిన్ అనే హర్మోన్‌ను తక్కువ చేస్తాయి. ఈ హార్మోనే అలసిపోయినట్టు, విశ్రాంతి భావనలను కలిగించేది. ఈ హార్మోన్ తగ్గడం వల్ల మెదడుకు సంకేతాలు సరిగా ఉండవు. దాంతో నిద్ర రమ్మన్నా రాదు. 
 
ఉదయం నిద్ర లేచిన తర్వాత అర గంటకు అల్పాహారం తీసుకోవడం అనువైనదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. అనువైన సమయం ఏదీ అంటే ఉదయం 7 గంటలు. బ్రేక్ ఫాస్ట్ ఆలస్యం అయితే ఆరోగ్యానికి మంచిది కాదు. ఉదయం 10 గంటల తర్వాత తీసుకోవడం సముచితమే కాదు. ఇక మధ్యాహ్నం 12.45 నుంచి 1 గంట లంచ్‌కు అనువైనది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత, మధ్యాహ్నం లంచ్‌కు మధ్య కనీసం 4 గంటల సమయం ఉండాలి. లంచ్‌ను సాయంత్రం 4 గంటల తర్వాత తీసుకోవడం అంత మంచిదేమీ కాదు. 
 
డిన్నర్‌కు అనువైన సమయం అంటే రాత్రి 7 గంటలు. రాత్రి భోజనం తర్వాత నుంచి నిద్ర వరకు 3 గంటల వ్యవధి ఉండాలి. రాత్రి 10 తర్వాతకు డిన్నర్‌ను వాయిదా వేయవద్దు. ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల డిన్నర్‌కు, నిద్రకు మధ్య సమయం తక్కువగా ఉంటుంది. తిన్న తర్వాత నిద్రిస్తే నిద్ర నాణ్యతపై ప్రభావం పడుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోర్లకు రోజూ నెయిల్ పాలిష్ వేస్తారా.. అయితే ఇక ఇంతే..