Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టర్ దగ్గరికి వెళితే నాలుక ఎందుకు చూస్తారో తెలుసా?

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (22:57 IST)
సాధారణంగా మనం ఏదైనా అనారోగ్య సమస్యతో వెళితే వెంటనే వైద్యుడు నాలుక చూపించమని అడుగుతుంటాడు. నాలుక లోపల లైట్ వేసి తదేకంగా చూస్తుంటాడు. ఎందుకంటే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి యొక్క నాలుక లేత గులాబీ రంగులో మృదువుగా ఉంటుందట.
 
నాలుక ఉదా రంగులో ఉంటే  రక్తప్రసరణ సమస్యలు ఉన్నాయని అర్థమట. అలాగే కొలెస్ట్రాల్ స్థాయి కూడా ఎక్కువగా ఉన్నాయని కూడా ఉంటుందని వైద్యులు గుర్తిస్తారట. అంతేకాకుండా పాలిపోయినట్లు అనిపిస్తే రక్తహీనత ఉన్నట్లేనని భావిస్తారట. 
 
అప్పుడు పోషకాలు ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తారట. అలాగే ఎర్రరంగులో ఉంటే మాత్రం విటమిన్ బి లోపం ఉందని చెపుతారు. జ్వరం వచ్చినప్పుడు కూడా నాలుక ఎరుపురంగులో మారుతుందట. యాంటీ బయాటిక్ మందులను ఎక్కువగా వాడితే నాలుక నల్లగా మారిపోతుందట. నోటీలో నాలుక మీద తరచూ పుండ్లు కూడా ఏర్పడుతుంటే శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థమట. 
 
అలా ఉంటే ఖచ్చితంగా విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలట. ఎక్కువ రోజులు నాలుకకు సంబంధించి సమస్యలు ఉంటే మాత్రం తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. అలాగే బ్రష్ చేసిన తరువాత తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే బాక్టీరియా నోటిలో పెరిగి అనారోగ్య సమస్యకు కారణమవుతుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మీ ఆయన కువైట్‌లో ఉన్నాడు కదా.. ఒంటరిగా ఎలా ఉంటున్నావ్.. ఏం కోరికలు లేవా...?

పిఠాపురంలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన పవన్, ఎందుకు?

బ్రిటన్ షాడో మంత్రివర్గంలో విదేశాంగ మంత్రి భారత సంతతి మహిళ

వైకాపా నేత పంచ్ ప్రభాకర్‌కు ఏపీ పోలీసుల పంచ్..

యూఎస్ ఎన్నికల ఫలితాలు : గూగుల్ ఉద్యోగులకు కీలక సూచనలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పాట్నా వేదికగా "పుష్ప-2" ప్రమోషన్ ఈవెంట్?

నా బరువు గురించి మీకెందుకయ్యా... నెటిజన్‌పై సమంత ఫైర్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments