Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొక్కజొన్న పొత్తులు తింటున్నారా లేదా? (video)

Webdunia
శనివారం, 19 సెప్టెంబరు 2020 (22:53 IST)
మొక్కజొన్న కాలం వచ్చేసింది. ఈ మొక్కజొన్న తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ముఖ్యంగా మొక్కజొన్న గింజల్లో కొవ్వు పదార్థాలు అంటే వెన్న, నూనె, క్రీమ్ వంటివి వేయకుండా తింటే త్వరగా అరుగుతాయి. వీటిలో ఉండే నూనెలు చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
 
అలానే పొత్తుల చివరన ఉండే పీచు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ నల్లటి పీచును ఉడికించి ఆ నీళ్లను వడకట్టి తీసుకుంటే మూత్రాశయానికి సంబంధించి ఏ ఇబ్బందులూ ఉండవు. వీటిని ఇతర ఏ పదార్థాల్లోనూ కలిపి తీసుకోకూడదు. తీసుకున్న వెంటనే గోరువెచ్చటి నీళ్లు తాగడం తప్పనిసరి.
 
అరుగుదల సరిగా లేనివారు... పాత బియ్యం, పెసలు, పేలాలు, చేపలు, బాగా ఉడికిన మాంసం, లేత ముల్లంగి, వెల్లుల్లి, పచ్చి అరటి, అనప, బీర, పొట్ల, వంకాయ, బీన్స్, క్యారెట్, దానిమ్మ, నారింజ, ఆవు పాలతో చేసిన మజ్జిగ వంటివి తీసుకోవాలి.
 
కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న గింజలు, చిక్కుళ్లు, పప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఆకలిగా వున్నప్పుడు తీసుకోవచ్చు. లేత గింజల్లో పోషకవిలువలు ఎక్కువగా వుంటుంది. వందగ్రాముల మొక్క జొన్నల్లో 365 కిలో కెలోరీల శక్తి ఉంటుంది.
 
మొక్కజొన్నల్లో గ్లూటిన్, సెల్యూలోజ్, పీచుపదార్థాలు ఉంటాయి. అవి పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపి.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. చక్కెర వ్యాధితో బాధపడేవారు, బరువు తగ్గాలనుకొనేవారు. ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధికి అడ్డుపడతాయి. గుండె పని తీరు సక్రమంగా ఉంటుంది.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మెడలో పుర్రెలు ధరించి వరంగల్ బెస్తంచెరువు స్మశానంలో లేడీ అఘోరి (video)

నారా రోహిత్‌కు లేఖ రాసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రోడ్ల నిర్మాణం.. చంద్రబాబు

పెళ్లైన రోజే.. గోడకు తలను కొట్టి.. చీరతో గొంతుకోసి భార్యను చంపేశాడు

విశాఖలో లా విద్యార్థినిపై సామూహిక అఘాయిత్యం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

కె.సీఆర్ స్పూర్తితో కేశవ చంద్ర రమావత్ సినిమా : హరీష్ రావు

తర్వాతి కథనం
Show comments