Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుశాంత్ మృతికి కారకులెవ్వరు? జయప్రదను టార్గెట్ చేసిన నగ్మ

Advertiesment
సుశాంత్ మృతికి కారకులెవ్వరు? జయప్రదను టార్గెట్ చేసిన నగ్మ
, శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (10:20 IST)
బాలీవుడ్ నటి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి కారకులెవ్వరో తెలుసుకోవాలని దేశ ప్రజలంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ మహిళా, సినీ నటి నగ్మా వ్యాఖ్యానించారు. కానీ, ఈ కేసు నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకు తెరపైకి బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియాను తెరపైకి తెచ్చారని నగ్మా ఆరోపించారు. ఈ విషయాన్ని సినీ నటి జయప్రద తెలుసుకోవాలంటూ నగ్మా చురకలు అంటించారు. 
 
సుశాంత్ ఆత్మహత్య కేసు ఇపుడు అనేక మలుపులు తిరుగుతోంది. ఆత్మహత్య కేసు దర్యాప్తు పక్కకుపోయింది. ఇపుడు తెరపైకి బాలీవుడ్‌లో మాదకద్రవ్యాల వచ్చింది. డ్రగ్స్‌ కోణం వెలువడటంతో కేసు మరో మలుపు తిరిగింది. పార్లమెంట్‌ వేదికగా దీనిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. 
 
ఇక మాదకద్రవ్యాల కోణం గురించి వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు, ఇతర నటీమణులకు మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో నటి, కాంగ్రెస్‌ నాయకురాలు నగ్మ.. బీజేపీ నాయకులు, సీనియర్‌ నటి జయప్రదను టార్గెట్‌ చేశారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు నుంచి ప్రజలను దారి మళ్లించడానికి మాదకద్రవ్యాలు, బాలీవుడ్‌లో డ్రగ్‌ కల్చర్‌‌ అంశాలను తెర మీదకు తెచ్చారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
 
ఇదే అంశంపై నగ్మా ఓ ట్వీట్ చేస్తూ... ''సీబీఐ, ఎన్‌సీబీ, ఈడీ దయచేసి సుశాంత్‌ కేసులో ఏం జరుగుతుందో బీజేపీ నాయకులు, జయప్రదకు తెలియజేయండి. సుశాంత్‌ చనిపోయి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. దేశప్రజలంతా సుశాంత్‌ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఫలితం లేదు. 
 
దీన్ని కవర్‌ చేయడానికి ఉన్నట్లుండి బీజేపీ నాయకులు బాలీవుడ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా దేశ ప్రజలు సుశాంత్‌ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని భావిస్తున్నారు' అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఎంపీ రవికిషన్‌ బాలీవుడ్‌లో డ్రగ్స్‌ వినియోగం ఉందంటూ చేసిన వ్యాఖ్యలకు జయప్రద మద్దతిచ్చారు. దాంతో నగ్మా ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి.. రాష్ట్రపతి పాలన విధించాలి... కంగనా