Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొలెస్ట్రాల్ కోడిగుడ్డులో ఎక్కడ ఉంటుందో తెలుసా...?

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (23:00 IST)
కోడిగుడ్డులో 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ గుడ్డులో ఎక్కడ ఉంటుందో తెలుసా...? గుడ్డు లోపలి పసుపుపచ్చని పదార్థంలోనే ఉంటుంది. కనుక ఒక గుడ్డును తినేవారికి ఎంచక్కా 212 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ చేరడం ఖాయం. ఐతే రోజుకు ఓ వ్యక్తికి కావలసిన కొలెస్ట్రాల్ కేవలం 300 మిల్లీగ్రాములు మాత్రమే.
 
ఒక్క గుడ్డుతోనే 212 మి.గ్రా చేరిపోతే, ఇక సాయంత్రంపూట తినే మిరపకాయ్ బజ్జీలు, గారెలు, పకోడీలు.. వగైరా వగైరా తింటే, ఇక చెప్పేదేముంది... ఏకంగా 500 మి.గ్రాలు ఇంకా అంతకుపైనే కొవ్వు "బస్తాలు బస్తాలు"గా చేరిపోవడం ఖాయం.
 
ఇలా రోజులో మోతాదుకు మించిన కొలెస్ట్రాల్ రక్తనాళాల్లోకి చేరి పేరుకుపోతుంటే అనారోగ్యం, ఆయాసం రాక ఏమవుతుంది. అంతేకాదండోయ్... ఇంకో సీరియస్ వ్యవహారం. ఇలా కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరంలో పెరిగిపోతే గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. వీటిని నిరోధించాలంటే.. ముందుగా ఈ గుడ్డుపైన కొద్దిగా టార్గెట్ పెట్టి తీరాల్సిందే.
 
ఎంత టార్గెట్ పెట్టినా గుడ్డు తినందే ఉండలేను బాసూ... గుడ్డు రుచి చూడాలని జిహ్వ కొట్టుకుంటుంది.. అంటే మాత్రం, గుడ్డు లోపలి పసుపుపచ్చ పదార్థం తీసేసి తెల్లని పదార్థాన్ని తినవచ్చు. ఎందుకంటే అందులో కొలెస్ట్రాల్ ఉండదు. కనుక... గుడ్డు తినేటపుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తినండి మరి. అలాగని టోటల్‌గా గుడ్డును మీ ఆహారం నుంచి తీసేయకండలా... కాస్త చూసుకుని తినండి. మీ ఆరోగ్యం వెరీ"గుడ్డు"గా ఉంటుంది. మీ ఆరోగ్యం మీ కుటుంబానికి మహాభాగ్యం.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments