Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఎగ్‌ మ్యాన్‌'గా గుర్తింపు.. 735 కోడిగుడ్లను నెత్తిపై పెట్టుకుని.. గిన్నిస్ రికార్డ్..!

Advertiesment
Egg-citing
, మంగళవారం, 12 అక్టోబరు 2021 (22:08 IST)
Egg Man
పశ్చిమ ఆఫ్రికాలోని కేప్‌ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి 'ఎగ్‌ మ్యాన్‌'గా పేరొందాడు. గ్రెగరీ అంటే పెద్దగా ఎవ్వరికి తెలీదు. కానీ ఎగ్ మ్యాన్ అంటే అందరికి గుర్తుంటుంది. ప్రపంచమంతా తిరిగి తన గుడ్ ట్యాలెంట్‌ను వివిధ దేశాల్లో ప్రదర్శించటం ఇతనికి అలవాటు. పలు టీవీ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. అలా అతను వరల్డ్‌ ఫేమస్‌ ఎగ్‌మ్యాన్‌గా పేరొందాడు. 
 
కాగా.. ఈ గుడ్ రికార్డు కోసం గ్రెగరీ ధరించిన టోపీపై గుడ్లన్నింటినీ అతికించడానికి మూడు రోజులు పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్‌ నిర్వహించిన గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు స్పెషల్‌ షోలో తలపై గుడ్లను పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్‌ చేస్తూ ప్రదర్శించాడు. 
 
అది చూసిన గిన్నీస్‌ రికార్డు ప్రతినిథులు కూడా 'వావ్‌' వెరీ గుడ్డు అని అనకుండా ఉండలేక పోయారట. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్‌ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్‌ రికార్డులో స్థానం సంపాధించుకున్నాడు గ్రెగరీ దా సిల్వా. 
 
ఏకంగా 735 గుడ్లు తల టోపీపై ఉంచుకుని అందరిని షాక్ కి గురిచేశాడు. అతను అలా గుడ్లతో బ్యాలన్స్ చేస్తుంటే వామ్మో పడిపోతాయేమో అన్నట్లుగా మనం ఫీల్ అయిపోతాం. కానీ అతను మాత్రం చక్కగా టోపీపై 735 గుడ్లు నిలబెట్టి వావ్..వెరీ వెరీ గుడ్డు అనిపించాడు. అంతేకాదు వెరీ గుడ్డు రికార్డు సాధించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిద్దెపైనున్న వివాహితపై కన్నేసిన ఖాకీ... గదికి రమ్మంటూ...