ఎముకలకు బలాన్నిచ్చే ఎండు ఖర్జూరాలు

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (13:28 IST)
ఎండు ఖర్జూరాలు తింటే ఎంత మేలు జరుగుతుంది. వీటిని తీసుకోవడం ద్వారా బీపీ నియంత్రణ‌లో ఉంటుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఎండు ఖ‌ర్జూర పండ్లను ఉద‌యాన్నే తిన‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌లంగా మారుతాయి. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్యల‌న్నింటిని తొలగించుకోవాలంటే.. ఎండు ఖర్జూరాలను రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. 
 
అజీర్తిని ఎండు ఖర్జూరాలు దూరం చేస్తాయి. గొంతు నొప్పి, మంట‌, జ‌లుబు లాంటి స‌మ‌స్యలు తొల‌గిపోతాయి. వీటిలో వుండే ఐరన్ శరీరానికి శక్తినిస్తుంది. బీపీని నియంత్రిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. అసిడిటీ, అల్సర్ వంటి స‌మ‌స్యలు మటుమాయమవుతాయి.
 
విట‌మిన్ బి5 ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మానికి మేలు జ‌రుగుతుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల చ‌ర్మానికి క‌లిగే న‌ష్టం త‌గ్గుతుంది. వృద్ధాప్యం కార‌ణంగా చ‌ర్మంపై వ‌చ్చే ముడ‌త‌లు త‌గ్గిపోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. బరువు తగ్గించేందుకు ఎండు ఖర్జూరాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. శిరోజాలు దృఢంగా మారేందుకు, జుట్టు వత్తుగా పెరిగేందుకు ఖర్జూరాలను డైట్‍‌లో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మటన్ బిర్యానీ పెట్టలేదని తిరుపతమ్మ తల్లి భక్తులకు యాచకులు ముష్టిఘాతాలు

National Herald Case: డిసెంబర్ 16కి వాయిదా పడిన నేషనల్ హెరాల్డ్ కేసు

నెల్లూరులో హత్య.. పోలీసులకు నిందితులకు ఫైట్.. కాల్పులు.. ఇద్దరికి గాయాలు

Cyclone Ditwah: దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా కదులుతోన్న దిత్వా తుఫాను

Pawan Kalyan: డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. జనసేన ఎంపీలకు పవన్ క్లాస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas-Anushka Wedding: ప్రభాస్ - అనుష్కల వివాహం.. ఏఐ వీడియో వైరల్.. పంతులుగా ఆర్జీవీ

Boyapati Srinu: ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా మంచి చెప్పడమే : బోయపాటి శ్రీను

Balakrishna:చరిత్రని సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర: నందమూరి బాలకృష్ణ

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

తర్వాతి కథనం
Show comments