Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేరుశెనగ పప్పుల్లో ఏమున్నదో తెలుసా?

Advertiesment
health benefits
, గురువారం, 27 ఫిబ్రవరి 2020 (20:27 IST)
వేరుశెనగవల్ల వంటకాలకు రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. మాంసాహారంలో లభించే మాంసకృత్తులన్నీ అంతే మోతాదులో లభించే ఈ వేరుశెనగ.. గుడ్డుకంటే రెండున్నర రెట్ల మాంసకృత్తులను అధికంగా అందిస్తుంది.
 
వేరుశెనగలో సమృద్ధిగా లభించే మాంసకృత్తులతో పాటు.. క్యాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, జింక్, బోరాన్‌లలు పుష్కళంగా లభిస్తాయి. అంతేగాకుండా వీటిని ఆహారంగా తీసుకోవటంవల్ల విటమిన్‌-ఇ, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి అందుతాయి. అయితే ఇందులో కొవ్వుశాతం కాస్త ఎక్కువ కాబట్టి కెలొరీలూ అంతే స్థాయిలో ఉంటాయని అర్థం చేసుకోవాలి.
 
పిల్లల ఎదుగుదలకు మాంసకృత్తుల పాత్ర అత్యంత కీలకం. అందుకే పోషకాహార లోపం కారణంగా బలహీనంగా ఉండే పిల్లలకు వేరుశెనగను మించి ఔషధం లేదు. అదే విధంగా గర్భిణులకు, పాలిచ్చే తల్లులకూ మాంసకృత్తులు వీటినుంచి సమృద్ధిగా లభిస్తాయి. వేరుశెనగతో రోగ నిరోధక శక్తి పటిష్టం అవుతుంది.
 
వేరుశెనగలో ఉండే రెస్వెరప్రాల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెజబ్బుల బారినుంచి కాపాడుతుంది. క్యాన్సర్‌ రిస్క్‌నూ తగ్గిస్తుంది. వార్ధక్యపు ఛాయలనూ దరిచేరనివ్వదు. గుండెజబ్బుల్ని నివారించే కొన్నిరకాల మందుల్లో వేరుశెనగ సుగుణాలుంటాయి. శరీరానికి మంచి చేసే మోనోఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ 50 శాతం మేరకు కలిగి ఉండే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవటంవల్ల క్యాన్సర్ ముప్పు తొలగుతుంది, అంతేగాకుండా కొలస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది.
 
బరువు తగ్గేందుకు, ఆర్థరైటిస్ నివారణలో సైతం వేరుశెనగ పప్పు చక్కని ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతోంది. ఇది పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించేందుకు తోడ్పడుతుంది. వీటిలో సుమారు 70 శాతం శాచురేటెడ్‌, 15 శాతం పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉన్నప్పటికీ మోనోఫ్యాట్స్‌ వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. ఈ పప్పులోని ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. పప్పుతోపాటు వేరుశెనగ నూనె కూడా మంచిదే. అయితే ఇందులో కేవలం ‘ఇ’ విటమిన్‌ మాత్రమే ఉంటుంది.
 
ఎలా వాడాలంటే... ప్రతి రోజూ సుమారు 25 గ్రాముల వేరుశెనగపప్పును ఏదో ఒక రూపంలో పిల్లలకు అందివ్వచ్చు. వీటిలో కొవ్వుశాతం కాస్త ఎక్కువ కాబట్టి, మోతాదు మించి తీసుకోకూడదు. బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ తీసుకోవాల్సిన కెలోరీల్లో కొన్నింటిని మానేసి బదులుగా మాత్రమే వేరుశెనగను ఎంచుకోవాలి. లేదంటే చిన్న చిన్న సమస్యలు తప్పవు. అయితే.. కొంతమందికి వేరుశెనగ పడదు. దీన్ని తిన్నవెంటనే ఎలర్జీ వస్తుంది. అలాంటివారు వెంటనే మానేయడం మేలు. పప్పు మాత్రమే కాకుండా, ఇలాంటివారు వేరుశెనగ నూనె కూడా వాడకపోవటం ఉత్తమం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మునగాకు సూప్.. నెలసరి సమయంలో.. అలాంటి రుగ్మతలకు చెక్ (video)