చిలకడదుంప అంటే చాలా మంది ఇష్టపడరు. కానీ అందులో ఉన్న పోషకాలు తెలిస్తే అసలు వదలరంటున్నారు వైద్య నిపుణులు. వారానికి రెండుసార్లు చిలకడదుంప తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు.
చిలకడదుంపలో విటమిన్ ఎ, సి, బి6, నియాసిస్, మాంగనీస్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు లభిస్తాయట. వీటిలోని పీచు, యాంటీ ఆక్సిడెంట్లు ఉదరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరీయా పెరిగే విధంగా చేస్తాయట.
అంతేకాదు జ్ఞాపక శక్తిని పెంచే గుణాలు కూడా చిలకడదుంపల్లో ఉంటాయని, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును తగ్గించగలదని నిపుణులు చెబుతున్నారు. చిలగడదుంపల్ని మనం తినే ఆహారంలో భాగం చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. అలాగే రక్తపోటు, మధుమేహం కూడా అదుపులో ఉంటాయని వైద్యులు చెపుతున్నారు.