ఇటీవలి కాలంలో చాలామందికి చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలు వచ్చేస్తున్నాయి. పెద్దవారి విషయం వేరే చెప్పక్కర్లేదు. అలాంటి వారికి ఆయుర్వేదం ప్రకారం తయారుచేసే కషాయం తాగితే మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్యులు. మరి ఆ కషాయం ఎలా చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
కొత్తిమీర - గుప్పెడు
నీరు - 1 గ్లాసు
తయారీ విధానం:
ముందుగా నీటిలో కొత్తిమీర వేసి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత చల్లార్చుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు రెండు పూటలా తాగాలి. ఇలా వరుసగా 40 రోజుల పాటు వాడిన తర్వాత మధ్యలో 10 రోజులు విరామం ఇచ్చి మళ్లీ తాగడం మొదలు పెట్టాలి. ఇలా చేయడం వలన పలురకాల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కొత్తిమీర కషాయం కిడ్నీ సమస్యలను అడ్డుకోవడంలో ఎంతో సహాయపడుతుంది.
కిడ్నీలకు సంబంధించి సాధారణంగా యూరినోబ్లాడర్ సమస్యలు, కిడ్నీ దెబ్బ తిన్నప్పుడు క్రియాటిన్ లెవల్ పెరగడం, కిడ్నీ పనితీరు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే.. కొత్తిమీర కషాయం తీసుకోవాలి.