Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మునగాకు సూప్.. నెలసరి సమయంలో.. అలాంటి రుగ్మతలకు చెక్ (video)

మునగాకు సూప్.. నెలసరి సమయంలో.. అలాంటి రుగ్మతలకు చెక్ (video)
, గురువారం, 27 ఫిబ్రవరి 2020 (17:47 IST)
Moringa leaves soup for women
నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే రక్తస్రావం, రక్తస్రావంలో గడ్డలు పడటం వంటి సమస్యలకు మునగాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మునగాకుతో చేసిన సూప్‌ను 21 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ రుగ్మతల నుంచి బయటపడవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అలాగే గర్భిణీ మహిళలకు కూడా మునగాకు భేష్‌గా పనిచేస్తుంది.
 
మునగాకు రసం తాగితే గర్భాశయం సాగకుండా ప్రసవం సులభంగా అవుతుంది. పాలుపడని బాలింతలకి కాసిని నీళ్లలో ఉప్పు, మునగాకులు వేసి కాసేపాగి ఆ నీటిని వంపేసి ఆకుల్ని నేతితో తినిపిస్తే ఫలితం ఉంటుంది. పొడి రూపంలో ఇచ్చినా పాలు మంచిదే. డయేరియా, కామెర్లూ, కలరా బాధితుల బాధ కాదు. ఒకటే దాహం. నీరసం. అప్పుడు రోజుకి రెండుమూడుసార్లు గ్లాసు కొబ్బరినీళ్లలో టీస్పూను మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి. మూత్ర సమస్యలకీ మునగ దివ్యౌషధంగా పనిచేస్తాయి. మునగ ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్‌ రసంలో కలిపి పదిగంటలకోసారి తీసుకుంటే హానికర బాక్టీరియా, వైరస్‌లన్నీ తొలగిపోతాయి.
 
మునగాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమల మచ్చలు, బ్లాక్‌హెడ్స్‌ మీద రాస్తే అవి మాయమైపోతాయి. రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకునో లేదా టీస్పూను పొడినో రోజూ వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఐరన్‌ వృద్ధి, రక్తం సమృద్ధి. అలాగే మునగాకు సూప్ ద్వారా ఊపిరితిత్తుల్లో టాక్సిన్లు తొలగి, శ్వాససంబంధిత రోగాలన్నీ నయం అవుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జామ పండ్లు తింటే ఏమవుతుంది? ఏంటి ప్రయోజనం?