ఎండాకాలం వచ్చేస్తోంది.. ఆ అమృతాన్ని.. మట్టికుండను మరిచిపోకండి..(video)

మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (13:12 IST)
ఎండాకాలం 30 రోజుల్లో వచ్చేస్తోంది. ఎండ నుంచి రక్షణ.. దప్పిక తీరేందుకు మజ్జిగను ఉపయోగించాలి. రోజుకు మూడుసార్లు మజ్జిగను తీసుకుంటే.. ఎంత ఎండ నుండైనా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. అయితే అనారోగ్యాన్ని ఇచ్చే కూల్‌డ్రింక్స్ మాత్రం తాగకుండా వుండటం మంచిది. కూల్‌డ్రింక్స్ కంటే లక్ష రెట్లు మజ్జిగ మేలుచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. ఇంకా ఎండాకాలంలో మట్టికుండను మరిచిపోకండి. మట్టికుండలో నీటిని పోస్తే నీటిలోని మలినాలను కుండ పీల్చుకుంటుంది.

అందుకే కుండలోని నీరు ఫిల్టర్ నీరంత స్వచ్ఛంగా మారుంతుంది. కుండలోని నీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వెల్లుల్లిని తీసుకుంటే 150 వ్యాధులు మటాష్.. వెల్లుల్లిని పాలలో ఉడికించి? (Video)