Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెదడు చురుకుగా పనిచేయాలంటే.. బీట్‌రూట్ రసం తాగాలట..

Webdunia
బుధవారం, 29 మే 2019 (19:18 IST)
మెదడు చురుకుగా ఉండాలని కోరుకునే వారు వ్యాయామం చేయడానికి ముందు బీట్‌రూట్ రసాన్ని త్రాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే విషయగ్రహణ సామర్థ్యం, భావోద్వేగాలు మెరుగ్గా ఉంటాయని, కదలికలతో ముడిపడిన మెదడు భాగాలు ఆరోగ్యంగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్‌రూట్‌లో నైట్రేట్‌ అధికంగా ఉంటుంది. 
 
వ్యాయామం చేసేటప్పుడు త్వరగా అలసిపోకుండా చూడటానికి, మెదడుకు రక్త సరఫరా మెరుగవ్వటానికి ఇది తోడ్పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. మెదడు ఆయుష్షు కూడా పెరుగుతుంది. నైట్రిక్‌ ఆక్సైడ్‌ చాలా శక్తివంతమైంది. ఇది మన శరీరంలో ఆక్సిజన్‌ అవసరమైన భాగాల్లోకి చొచ్చుకొని వెళ్తుంది. ఆక్సిజన్‌ను పెద్దమొత్తంలో వినియోగించుకునే అవయవం మెదడే. 
 
కాబట్టి ఇది మెదడుకు మరింత ఎక్కువగా ఆక్సిజన్‌ సరఫరా అయ్యేలా చేస్తుంది. బీట్‌రూట్‌లోని నైట్రేట్‌ ముందు నైట్రైట్‌గానూ, అనంతరం నైట్రిక్‌ ఆక్సైడ్‌గానూ మారుతుంది. ఇది రక్తనాళాలు విప్పారేలా చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. 
 
బీట్‌రూట్‌ రసంతో రక్తపోటు తగ్గుతున్నట్టు కూడా గత అధ్యయనాల్లో వెల్లడైంది. ఇది కూడా మెదడుకు మేలు చేసేదే. కాబట్టి బీట్‌రూట్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments