ప్లాస్టిక్ డ్రమ్‌లలో నీరు త్రాగడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే మునుపు అందరూ ఇళ్లలో పాత్రలలో నీరు ఉంచుకుని త్రాగేవారు. అలా త్రాగడమే ఎంతో మంచిది. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు త్రాగితే అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు త్రాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నీటిని రాగి పాత్రలో కనీసం ఎనిమిది గంటలు ఉంచాలి.
శరీరంపై ముడతలు కనపడకుండా ఉండాలంటే రాగి నీళ్లు త్రాగండి. ఈ నీళ్లు త్రాగితే కడుపు ఉబ్బరం, కడుపులో మంట, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. మెదడు పనితీరును మెరుగుపరచడంలో ఇవి బాగా తోడ్పడతాయి. రక్తకణాలను శుద్ధి చేయడం వలన శరీరంలో మలినాలు తగ్గుతాయి. దీని వలన శరీరం ప్రకాశవంతంగా తయారవుతుంది. రాగి పాత్రలోని నీరు త్రాగితే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది.